న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర నియామక సంస్థలు.. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటితో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తు సైతం స్వీకరించాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో జరగనున్న పలు ఉద్యోగ, ప్రవేశ పరీక్షల వివరాలు, వాటి తేదీలకు సంబంధించిన వివరాలు అభ్యర్ధుల అవగాహణ కోసం ఇక్కడ పొందుపరిచాం. ఆ వివరాలు ఇవే
సెప్టెంబర్‌లో జరగనున్న రాత పరీక్షల తేదీలు ఇవే..
- యూపీఎస్సీ ఎన్‌డీఏ-2 ఎగ్జామ్ సెప్టెంబర్ 1వ తేదీన జరుగుతుంది
- యూపీఎస్సీ సీడీఎస్-2 ఎగ్జామ్ సెప్టెంబర్ 1 వ తేదీన జరుగుతుంది
- ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (టైర్-1) 2024 ఎగ్జామ్ సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు జరుగుతుంది
- జిప్‌మర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష సెప్టెంబర్ 14 వ తేదీన జరుగుతుంది
- ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవల్దార్ ఎగ్జామ్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది
తెలంగాణ జెన్‌కో ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి జులై 14న ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇటీవల విడుదల చేశారు. మొత్తం 339 సహాయ ఇంజినీరు(ఏఈ), 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
జెన్‌కో ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.