భారతదేశంలో క్రీడా శక్తి వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. భారత ఫుట్‌బాల్ క్రీడను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కేంద్ర సమాచార, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి బుధవారం బాలీవుడ్ సినీ నటుడు జాన్ అబ్రహం, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ CEO మందార్ తమ్హానేను కలిశారు. ఈ సందర్భంగా మందార్ తమ్హానే జ్యోతిరాదిత్య సింధియాకు కొత్త జెర్సీని అందజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ట్వీట్ చేశారు. జాన్ అబ్రహం, మందార్ తమ్హానేను కలవడం ఆనందంగా ఉందంటూ పేర్కొన్నారు.
‘‘క్రీడల పట్ల లోతైన అభిరుచిని, యువ ప్రతిభను గుర్తించి, శిక్షణతో తీర్చిదిద్ది, మద్దతు ఇచ్చే తపనను పంచుకునే వ్యక్తితో కనెక్ట్ అవ్వడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది.. ముఖ్యంగా భారతదేశ క్రీడా శక్తి కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈశాన్య ప్రాంతంలో వారి సహకారం ఎంతో తోడ్పాటునందిస్తుంది. ఫుట్‌బాల్ పట్ల జాన్‌కు ఉన్న అజేయమైన ఉత్సాహం.. మన నేల నుంచి మెస్సీ లేదా రొనాల్డో ఎదగడాన్ని చూడాలనే ఆయన కల నిజంగా స్ఫూర్తిదాయకం.. భారత ఫుట్‌బాల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో అతని కల ఫలించాలని.. వారి జట్టుకు గొప్ప విజయాలను అందించాలని కోరుకుంటున్నాను’’.. అంటూ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ చేశారు.
A pleasure to meet @TheJohnAbraham along with @MandarTamhane1, CEO of Northeast United FC.
Always a delight connecting with someone who also shares a deep passion for sports and a drive to scout, shape & support young talent, especially in the Northeast, which is rapidly… pic.twitter.com/ibRf07NWM0
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..