పుష్ప 2 తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ తో అంతకు మించి సక్సెస్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే కాస్త టైం తీసుకొని మరి అట్లీ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.
ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు అట్లీ.
ఇండియాలోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ఫిలిమ్ గా AAA 22 తీసుకొస్తున్నారని చెప్పారు. అయితే ఇంకా బడ్జెట్ లెక్కలు వెల్లడించలేదు. కానీ అన్నింటికన్నా ఇదే భారీ చిత్రం అన్న విషయంలో మాత్రం అనుమానం లేదన్నారు అట్లీ.
AAA 22 పారలెల్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన దీపికా పదుకునే టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అట్లీ కూడా ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలు పరిచయం చేస్తున్నామని చెప్పడంతో ఫాంటసీ కాన్సెప్ట్ ఉంటుందని కన్ఫర్మ్ అయింది.
ఈ భారీ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ముగ్గురు అందాల భామలు బన్నీకి జోడీగా కనిపించబోతున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు.