సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే హీరోయిన్స్ ఎలాంటి సాహసం చేయడానికైనా సరే వెనకాడరు. ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తమ టాలెంట్ చూపించడానికి హీరోయిన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎలాంటి పాత్ర అయినా సరే హీరోయిన్స్ ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. కాగా ఓ హీరోయిన్ ఏకంగా సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారింది. అంతే కాదు ఆ పాత్ర కోసం ఏకంగా 12 కిలోలు బరువు పెరిగింది. ఇక ఆ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కోట్ల రూపాయిలు వసూళ్లు రాబట్టింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారిన ఆమె ఆతర్వాత అది మానలేకపోయా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. తాను నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. హిందీలో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలోనూ నటించి మెప్పించింది. తమిళంలో విడుదలైన నేరకొండ పర్విహిలో అజిత్ భార్య పాత్రను పోషించింది. తక్కువ సమయంలోనే హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ అందుకుంది. హిందీ చిత్రసీమలో ప్రయోగాత్మకంగా విద్యాబాలన్ చాలా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.
ఇవి కూడా చదవండి
2010లో వచ్చిన ది డర్టీ పిక్చర్ మూవీ ఆమె కెరీర్ మర్చేసింది. ఈ చిత్రంలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది. సినిమాలో చైన్ స్మోకర్గా ఉండాల్సి రావడంతో దాదాపు 12 కిలోల వరకు బరువు పెరిగింది. అంతేకాదు.. ఈ పాత్ర కోసం 2 గంటల్లో దాదాపు 15 సిగరెట్లు తాగింది. ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పొగతాగడం హానికరం కాకపోతే నేను చైన్ స్మోకర్గా ఉండేదానిని” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. డర్జీ పిక్చర్ తర్వాత సిగరెట్ తాగడం మానలేదని.. కాకపోతే రోజుకు 3 సిగరెట్లు తాగనని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నటించేందుకు తొలుత కంగనా రనౌత్, బిపాసా బసులను చిత్ర బృందం సంప్రదించింది. వారు నిరాకరించడంతో ఆ సినిమా విద్యాబాలన్‌కి వెళ్లింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 117 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రంలో విద్యాబాలన్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, నస్రుద్దీన్ షా, తుషార్ కపూర్ నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.