అరుంధతి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది అనుష్క శెట్టి. డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇందులో పశుపతి పాత్రలో సోనూసూద్, జేజమ్మ పాత్రలో అనుష్క యాక్టింగ్ అదరగొట్టేశారు. ఈ సినిమాతో అనుష్క నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.