ఆమె వయస్సు 27 సంవత్సరాలు ఉంటుంది. 9 నెలల కడుపుతో బస్సు ఎక్కింది. నిజంగానే కడుపుతో ఉందని అనుకుంటే మీరు పొరబడినట్టే. కట్ చేస్తే.. ఆమె విషయం మొత్తం పోలీస్ స్టేషన్లో తేలింది. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నకిలీ బేబీ బంప్లో భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను పట్టుకున్నారు పోలీసులు. సదరు 27 ఏళ్ల అనుమానితురాలు లేటెక్స్ బెల్లీ ధరించి.. చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ రవాణా చేస్తోందామె. కట్ చేస్తే.. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె లోపల 5,600 డోసుల కొకైన్ దాచినట్టు అధికారులు కనుగొన్నారు.
ఎవ్వరికీ దొరక్కుండా ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆమెను పట్టుకున్నారు పోలీసులు. కొలంబియాలోని బొగోటాకు నైరుతి దిశలో ఉన్న నారినో నుంచి ఆమె వస్తున్నట్టు గుర్తించారు. కాలిలోని సియుడాడ్ నుంచి ఆమె మరో ప్రాంతానికి బస్సు ఎక్కుతుండగా అడ్డంగా దొరికింది. పోలీసుల ప్రకారం, ఈ అధునాతన నకిలీ బెల్లీస్ సాధారణంగా విదేశాల నుంచి మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్లు దాదాపు 538 పౌండ్లతో కొనుగోలు చేస్తున్నారట. తర్వాత వాటిని కొలంబియాలోకి తెస్తున్నారట. కాగా, సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అధికారులు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..