పూర్వకాలంలో పక్షల ద్వారానే రాజులు, చక్రవర్తులకు సమాచారన్ని చేరవేసేవారు. అంతే కాకుండా ఇవి ముందు జరిగే సంఘటనలను కూడా త్వరగా పసిగడుతాయి అంటారు. అయితే శకున్ శాస్త్రం ప్రకారం కాకులకు సంబంధించిన కొన్ని సంకేతాలు భవిష్యత్తులో కొన్ని చెడు సంకేతాలను సూచిస్తాయంట.కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం
కాకులు కొన్ని సమాచారలను ముందుగానే చేరవేస్తాయని చెబుతుంటారు పండితులు. ఎందుకంటే కొన్ని సార్లు కాకులు ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన పెద్ద వారు ఎవరైనా చుట్టాలు వస్తున్నారమో.. చుట్టాలు వచ్చే ముందు కాకులు ఇంటి మీద వాలి అరుస్తాయని అంటుంటారు. అంతే కాకుండా కాకి ఇంటి మీద వాలి ఏవైనా తినట్లు కనిపించినా లేదా పండ్లను కొరికి ఇంటిపై వదిలేసినా, లేదా పువ్వులను తీసుకొచ్చి ఇంటి మీద వేసి వెళ్లిపైనా అది చాలా శుభప్రదం అంటారు. అంతే కాకుండా ఈ ఇంట్లో మగసంతానం పుడుతుందని కూడా అర్థం అంటారు.
అదే విధంగా ఒక వేళ కాకి తాను గూడు కట్టుకున్న గడ్డి పరకను తీసుకొచ్చి ఇంటి ముందు వేస్తే ఆ ఇంట్లో ఆడ సంతానం పుడుతుందని అంటారు. అయితే వివాహ జీవితంపై కూడా కాకి కొన్ని ముందస్తు విషయాను తెలియజేస్తుందంట. కాకి ఇచ్చే చిన్న సంకేతాలు విస్మరిస్తే భవిష్యత్తులో వివాహాజీవితం నాశనం అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు పండితులు.
కాకులు సాధారణ మంచి లేదా చెడు శకునాలను సూచిస్తాయి. అయితే వివాహం సమయంలో కాకి పెళ్లి మండపంపై వాలితే, వివాహం విజయవంతం కాదని లేదా సంబంధంలో చీలిక వస్తుందని నమ్ముతారు. కొన్ని ప్రదేశాలలో, దీనిని మరణం లేదా దురదృష్టానికి సంకేతంగా కూడా భావిస్తారు. అందుకే కాకి ఇచ్చే ఈ సంకేతం అస్సలే విస్మరించకూడదంట. ఇలా కాకులే కాకుండా వివిధ రకాల పక్షులు కూడా ఇలా శుభ, అశుభ సంకేతాలను ఇస్తుంటాయని చెప్తుంటారు.
ఇక ఒక పక్షి తల వంచినా లేదా శుభ కార్యక్రమంలో ముందుకు వచ్చినా, అది అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మరోవైపు, ఒక పక్షి వచ్చి మీ భుజంపై కూర్చుంటే, అది ఆర్థిక లాభం లేదా ఏదైనా శుభ సంకేతం అంటారు.