Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ దెబ్బతో ఇరాన్ పని ఖతం.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకబోతున్నాంః డొనాల్డ్ ట్రంప్

12 March 2026

Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

12 March 2026

Celebs Beauty Trends: బోల్డ్ ఐస్.. గ్లాసీ లిప్స్! సంప్రదాయానికి ఆధునికతను జోడించిన సెలబ్రిటీల మేకప్ మ్యాజిక్!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guttikonda Srinivas Flood Relief Donation,ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు – srinivas guthikonda donated one crore to andhra pradesh cm relief fund
ఆంధ్రప్రదేశ్

Guttikonda Srinivas Flood Relief Donation,ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు – srinivas guthikonda donated one crore to andhra pradesh cm relief fund

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guttikonda Srinivas Flood Relief Donation,ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు – srinivas guthikonda donated one crore to andhra pradesh cm relief fund
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరో ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు.ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. ప్రభుత్వంబాధితులకు అందిస్తున్న సాయంలో.. ఆయన కూడా తనవంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. అలాగే వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధించాయని.. వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని.. గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకుగాను శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీనివాస్ గుత్తికొండ ఇంతకు ముందు హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో కూడా విరాళాలు అందించారు.

మరికొందరు కూడా ఏపీకి సాయం అందించారు. టాలీవుడ్ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సీ అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే ఆయ్ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాసు కూడా వారం పాటూ తమ మూవీకి వచ్చే షేర్‌లో 25శాతం విరాళంగా ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీకి రూ.5 లక్షలు, తెలంగాణకు రూ.5లక్షలు సాయం పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు, కుమార్తెలు రెండు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షలు సాయంగా అందజేశారు. వీరితో పాటుగా పలువురు సామాన్యులు కూడా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు రూ.1.50 లక్షలు అందజేశారు. అలాగే జంబులయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ వర్ధంశెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష విరాళం అందించారు. చెక్కును నంద్యాల కలెక్టరేట్‌ చాంబర్‌లో కలెక్టర్‌ రాజకుమారికి అందజేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారని.. వరదబాధితుల సహాయార్థం తన వంతుగా సాయం అందించానన్నారు.

మరోవైపు విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 2 గంటల వరకూ విజయవాడ కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయ చర్యలు, వరద వంటి అంశాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన సోమవారం రాత్రి కూడా కలెక్టరేట్‌ వద్ద బస్సులోనే బస చేశారు. 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. మంత్రి నారా లోకేష్ కూడా అర్ధరాత్రి దాటే వరకూ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. నేడు విజయవాడకు అదనపు బలగాలు, సహాయక బృందాలు వచ్చాయి. విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.. బాధితులకు ఆహారం అందిస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Employees 2 Months Paternity Leave,ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. 2 నెలల పితృత్వ సెలవు, వెల్‌నెస్‌ లీవ్‌ పేరుతో 15 రోజులు సెలవు – andhra pradesh government to implement paternity leave for third child for employees

12 March 2026

నా సామిరంగ.. ఈ మేత కానీ వేస్తే జాతి పుంజులకు ఇక తిరుగుండదు..

12 March 2026

Ap Govt Smart Family Card,ఏపీ ప్రజల కోసం స్మార్ట్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, జస్ట్ స్కాన్ చేస్తే చాలు – andhra pradesh government plans family card discussed in collectors conference

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఈ దెబ్బతో ఇరాన్ పని ఖతం.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకబోతున్నాంః డొనాల్డ్ ట్రంప్

12 March 2026

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ,…

Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

12 March 2026

Celebs Beauty Trends: బోల్డ్ ఐస్.. గ్లాసీ లిప్స్! సంప్రదాయానికి ఆధునికతను జోడించిన సెలబ్రిటీల మేకప్ మ్యాజిక్!

12 March 2026

Ap Govt Employees 2 Months Paternity Leave,ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. 2 నెలల పితృత్వ సెలవు, వెల్‌నెస్‌ లీవ్‌ పేరుతో 15 రోజులు సెలవు – andhra pradesh government to implement paternity leave for third child for employees

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఈ దెబ్బతో ఇరాన్ పని ఖతం.. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకబోతున్నాంః డొనాల్డ్ ట్రంప్

12 March 2026

Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

12 March 2026

Celebs Beauty Trends: బోల్డ్ ఐస్.. గ్లాసీ లిప్స్! సంప్రదాయానికి ఆధునికతను జోడించిన సెలబ్రిటీల మేకప్ మ్యాజిక్!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.