ది రాజాసాబ్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి. ఇది హారర్ కామెడీ మూవీ అయినా… ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయన్నారు. ఓ తాత, నానమ్మ, మనవడి మధ్య జరిగే కథగా ది రాజాసాబ్ తెరకెక్కుతుంది అన్నారు. ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని మేకింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్యాన్స్ వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఖుషి అవుతున్నారు.