సినీరంగంలో ఒకప్పుడు టాప్ నటిగా వెలిగింది. కథానాయికగా, వీజేగా, ఫెమినా మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది. ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రేమలో విఫలమయ్యింది. దీంతో 26 ఏళ్ల వయసులోనే ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ నఫీసా జోసెఫ్. థాల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2004లో ముంబైలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 26 ఏళ్ల వయసులోనే జీవితాన్ని ముగించింది. నఫీసా తల్లి బెంగాలీ. ఆమె తండ్రి మలయాళీ.
1978లో జన్మించిన నఫీసా 12 సంవత్సరాల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1997లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఈ అందాల పోటీలో పాల్గొన్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ ప్రజెంటర్ గా పనిచేసింది. అనిల్ కపూర్, ఐశ్వర్యరాయ్ కలిసి నటించిన థాల్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యాపారవేత్త గౌతమ్ తో ప్రేమలో పడింది. వీరి పెళ్లికి ఏర్పాట్లు సైతం జరిగాయి. కానీ అప్పటికే అతడికి వివాహం జరిగిపోయింది.
అయితే అతడు తనకు పెళ్లి కాలేదని చెప్పి నఫీసాను మోసం చేశాడు. తన ప్రియుడి పెళ్లి విషయం తెలియడంతో నఫీసా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. దీంతో ఆమె తన గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ప్రేమ విఫలం కావడంతో 26 ఏళ్లకే తనువు చాలించింది.

Nafisa Joseph New
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..