కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారడం వల్ల పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపో తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది.