Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Bigg Boss 9 Telugu: అంతా సిద్ధం.. బిగ్‏బాస్‏లోకి కాంట్రవర్సీ క్వీన్స్.. ఈసారి వేరేలెవల్..

22 June 2025

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

22 June 2025

Watch: కావేరి నీటి విడుదలతో గ్రామస్తుల సంబరాలు.. సోషల్ మీడియాను ముంచేసిన భావోద్వేగం..! ఏం చేశారంటే..

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh High Court,ట్రాన్స్‌ఉమన్‌‌ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు – andhra pradesh high court rules transgender women also right to file ipc 498a in ongole case
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh High Court,ట్రాన్స్‌ఉమన్‌‌ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు – andhra pradesh high court rules transgender women also right to file ipc 498a in ongole case

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh High Court,ట్రాన్స్‌ఉమన్‌‌ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు – andhra pradesh high court rules transgender women also right to file ipc 498a in ongole case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్‌జెండర్‌ను మహిళగా పరిగణించకూడదనే వాదనను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ట్రాన్స్‌జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. వరకట్న వేధింపుల కేసు కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా వారికి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో వేధింపులు జరిగినట్లు ఆధారాలు లేనందున.. ఆమె భర్త, అత్తమాలపై పెట్టిన కేసును కొట్టివేసింది.

హైలైట్:

  • ప్రేమించి పెళ్లిచేసుకున్న ట్రాన్స్‌జెండర్‌ మహిళ
  • అత్తింటివారిపై 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు
  • సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు (ఫోటోలు– Samayam Telugu)
పురుషుడి నుంచి స్త్రీగా మారిన ట్రాన్స్‌జెండర్‌ను సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే కారణంతో మహిళగా పరిగణించకూడదనే వాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ( హైకోర్టు) తోసిపుచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేసింది. పిల్లల్ని కనే సామర్థ్యం లేదన్న కారణంతో ట్రాన్స్‌ఉమన్‌కు స్త్రీ హోదా నిరాకరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, వరకట్న వేధింపుల కేసు (IPC సెక్షన్ 498(A)) కింద ఆమెకు ఫిర్యాదు చేసే హక్కు ఉందని తేల్చిచెప్పింది. అయితే ఈ కేసులో ఆమెపై వేధింపులు జరిగినట్లు ఆధారాలు లేనందున కేసును కొట్టివేసింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన షబానా లింమార్పిడి చేయించుకుని పురుషుడి నుంచి మహిళగా మారారు. చెన్నైకి చెందిన విశ్వనాథన్‌ కృష్ణమూర్తి, షబానా ప్రేమించుకున్నారు. దీంతో 2019 జనవరి 21న హైదరాబాద్‌లో ఆర్య సమాజ్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత చెన్నైలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిన కృష్ణమూర్తి తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో చెన్నైలోని కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన షబానా అతడి తల్లిదండ్రులతో గొడవపడ్డారు. అయితే, వాళ్లు తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ ఆమె ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

తమ కుటుంంబంపై పెట్టిన కేసును కొట్టివేయాలని కృష్ణమూర్తి, అతడి తల్లిదండ్రులు 2022లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్స్‌జెండర్‌కు సంతానోత్పత్తి సామర్థ్యం ఉండదని, కాబట్టి ట్రాన్స్‌ఉమన్‌ను మహిళగా పరిగణించలేమని వారి తరపు న్యాయవాది వాదించారు. అందువల్ల షబానాకు IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే అర్హత లేదని అన్నారు. వేధింపులకు గురి చేశారనడానికి ఆధారాలు లేవని కూడా ఆయన వాదించారు. పోలీసుల తరఫున ఏపీపీ ప్రియాంక లక్ష్మి వాదనలు వినిపించారు.

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టుకతో వచ్చిన లింగమే శాశ్వతం కాదని అన్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాపాడటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. లింగ గుర్తింపు కోసం ట్రాన్స్‌జెండర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పుట్టినప్పుడు పేర్కొన్న లింగాన్నే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం లేకుండా ఆదేశాలివ్వాలని కోరారని తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి రాజ్యాంగం కల్పించిన హక్కులు పురుషులు, స్త్రీలకే పరిమితం కాదని, ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తాయని తెలిపిందన్నారు.

ఈ తీర్పునకు అనుగుణంగా 2019లో ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (హక్కుల రక్షణ) చట్టాన్ని తీసుకొచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వివాహం తర్వాత భిన్న లింగసంపర్క సంబంధం ఉన్న ట్రాన్స్‌ఉమన్‌/ట్రాన్స్‌జెండర్‌కు 498(A) కింద కేసు పెట్టే హక్కు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో కట్నం కోసం వేధించారని చెప్పడానికి తగిన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

ట్రాన్స్‌ఉమన్‌‌ వరకట్న వేధింపుల కేసు పెట్టొచ్చా.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

‘స్త్రీత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేసే సంకుచిత భావన రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేసి చూడటమే’ అని కోర్టు పేర్కొంది. పిల్లల్ని కనగలిగితేనే స్త్రీ అవుతారనే ఆలోచన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కును కల్పించిందని గుర్తు చేసింది. ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాన హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది.

ట్రాన్స్‌జెండర్లకు తమ లింగ గుర్తింపును తామే నిర్ణయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పిల్లల్ని కనే సామర్థ్యం లేదనే కారణంతో ట్రాన్స్‌ఉమన్‌కు స్త్రీ హోదాను నిరాకరించడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే, IPC సెక్షన్ 498(A) కింద కేసు పెట్టే హక్కు లేదనడం కూడా ఆమె పట్ల వివక్ష చూపడమేనని కోర్టు అభిప్రాయపడింది. ట్రాన్స్‌ఉమన్‌కు ఆమె భర్త, అత్తమామలు, బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

22 June 2025

అప్పుడే కళకళలాడుతున్న రిజర్వాయర్లు..! రైతులకు ఇక ఢోకా లేనట్టే..!

22 June 2025

Andhra Pradesh Govt Starts Peyya Sayam,ఏపీ కీలక నిర్ణయం.. రూ.52 కోట్లతో పెయ్య సాయం.. ఆడ దూడలే పుట్టేలా.. – andhra pradesh govt starts peyya sayam programme to deliver only female heifer calf

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Bigg Boss 9 Telugu: అంతా సిద్ధం.. బిగ్‏బాస్‏లోకి కాంట్రవర్సీ క్వీన్స్.. ఈసారి వేరేలెవల్..

22 June 2025

బిగ్ బాస్ రియాల్టీ షో.. బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న షో. ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో…

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

22 June 2025

Watch: కావేరి నీటి విడుదలతో గ్రామస్తుల సంబరాలు.. సోషల్ మీడియాను ముంచేసిన భావోద్వేగం..! ఏం చేశారంటే..

22 June 2025

మొత్తానికి దొరికేసింది మావ..! సింగిల్ సినిమాలో ఈమెను గుర్తుపట్టారా.? ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Bigg Boss 9 Telugu: అంతా సిద్ధం.. బిగ్‏బాస్‏లోకి కాంట్రవర్సీ క్వీన్స్.. ఈసారి వేరేలెవల్..

22 June 2025

Tirumala 24 Hours For Darshan,తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూ.. దర్శనానికి 24 గంటలు – ttd said devotees rush continues in tirumala on june 21 it takes 24 hours for darshan

22 June 2025

Watch: కావేరి నీటి విడుదలతో గ్రామస్తుల సంబరాలు.. సోషల్ మీడియాను ముంచేసిన భావోద్వేగం..! ఏం చేశారంటే..

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.