ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. సినిమాలకే కాదు.. బలమైన వ్యక్తిత్వం… స్టైలీష్ లుక్స్.. విలాసవంతమైన జీవనశైలికి అతడు ప్రసిద్ధి. తన స్టైలీష్ లుక్స్ తో పార్టీస్, ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటారు. ముఖ్యంగా ఖరీదైన గడియారాలు, డిజైనర్ దుస్తుల నుంచి టాప్ ఎండ్ కార్ల వరకు.. సల్మాన్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో సల్మాన్ ఎప్పుడూ తన స్టైలీష్ లుక్స్ తో మరింత అందంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. అయితే తాజాగా తన గ్యారేజీలోకి మరో అద్భుతమైన కారు వచ్చినట్లు సమాచారం. అదే మెర్సిడెస్-మేబాచ్ GLS 600.
ఇటీవల సల్మాన్ ఖాన్ ఈ లగ్జరీ SUV ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అయితే ఫ్యాన్స్ విండ్షీల్డ్పై 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్‌ను గమనించారు. అంటే ఇది కొత్తగా రిజిస్టర్ చేయబడిన కారు అని అర్థం. SUV బోల్డ్ లుక్, శక్తివంతమైన ఉనికి సల్మాన్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఈ GLS 600 బేస్ ధర దాదాపు రూ. 3.39 కోట్లు. బుల్లెట్ ప్రూఫ్ అయితే, ధర రూ. 5 కోట్లకు మించి ఉండవచ్చని సమాచారం. అయితే ఇప్పుడు సల్మాన్ తీసుకున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావచ్చని కావచ్చని అంటున్నారు ఫ్యాన్స్. గతంలో సల్మాన్ కు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే.. సల్మాన్ కారు కలెక్షన్..
- రేంజ్ రోవర్ SC LWB 3.0
- టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200
- మెర్సిడెస్-బెంజ్ GL
- ఆడి RS7
- బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్
- ఆడి A8L
- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
- మెర్సిడెస్-బెంజ్ AMG GLE కూపే
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..