Yoga Day 2025 Yogandhra Records: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ పేరుతో ఘనంగా కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించి మొత్తం 23 రికార్డులతో చరిత్ర సృష్టించింది. 27 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి రికార్డు నెలకొల్పారు. ఆ వివరాలు..
హైలైట్:
- విజయవంతంగా ముగిసిన యోగాంధ్ర
- యోగాంధ్ర పేరిట 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు
- మరో 21 వరల్డ్ బుక్ రికార్డ్స్

2 గిన్నిస్ రికార్డులు
యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. ఒకే వేదికపై ఎక్కువ మంది ప్రజలు యోగా సాధన చేసినందుకు గాను, అలానే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే వేదికపై సూర్య నమస్కారాలు చేసినందుకు మరో గిన్నిస్ రికార్డు సృష్టించింది.
మరో 21 ప్రపంచ రికార్డులు
- యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో నమోదు
- వ్యక్తిగతంగా భారీ సంఖ్యలో యోగా శిక్షణ తీసుకోవడం
- 2 కోట్ల మందితో లక్ష ప్రాంతాల్లో యోగా
- ఎక్కువ సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ
- నెల వ్యవధిలోనే సముద్రం ఒడ్డున ఎక్కువ సంఖ్యలో యోగా కార్యక్రమాలు
- అధిక సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ
- ఒక్క రోజులో 75 స్థలాల్లో వృద్ధులు అధిక సంఖ్యలో యోగాలో పాల్గొనడం
- నెల రోజుల వ్యవధిలో ధార్మిక స్థలాల్లో అధిక సంఖ్యలో యోగా కార్యక్రమాల నిర్వహణ
- యోగా గురించి పెద్ద మొత్తంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం
- ఒకే వేదికపై అధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం
- నెల రోజుల వ్యవధిలోనే బౌద్ధ వారసత్వ స్థలాల్లోయోగా కార్యక్రమాల నిర్వహణ
- నెల రోజుల వ్యవధిలో పురావస్తు ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు
- జైల్లో పెద్ద సంఖ్యలో యోగా నిర్వహణ
- కూచిపూడి నృత్య భంగిమల్లో భారీ మానవహారం
- ఒకే కార్యక్రమంలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనడం
- ఒకే వేదికపై అధిక సంఖ్యలో కుటుంబాల భాగస్వామ్యం
- అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొనడం
- అధిక సంఖ్యలో గిరిజనుల భాగస్వామ్యం
- పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం
- వృక్షాకారంలో భారీ మానవహారం
- త్రికోణాసనంలో భారీ మానవహారం
ఇలా 21 ప్రపంచ రికార్డులు యోగాంధ్ర పేరిట నమోదయ్యాయి. ఇక యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.