
అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతోయ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా. ఆతర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య బాలీవుడ్ లో ఎక్కువ సందడి చేస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే మొన్నటివరకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది తమన్నా..
తమన్నా, విజయ్ వర్మ చట్టపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంటపడ్డారు. అలాగే ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇక ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు షికారు చేశాయి. వాటికి తగ్గట్టుగానే కొన్ని ఈవెంట్స్ లో తమన్నా, విజయ్ వర్మ విడివిడిగా కనిపించారు. బ్రేకప్ వార్తల తర్వాత ఈ ఇద్దరూ కలిసి కనిపించిందే లేదు. దాంతో ఈ ఇద్దరూ విడిపోయారని ఫ్యాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు.
ఇక పోతే విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. నాని హీరోగా నటించిన ఎంసిఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో విలన్ గా నటించాడు. ఆతర్వాత మరో సినిమాలో నటించలేదు. అయితే ఇప్పుడు తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ ఇప్పుడు మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్.. దంగల్ సినిమాతో ఈ చిన్నది పాపులర్ అయ్యింది. ఇటీవలే ఈ విజయ్ వర్మ, ఫాతిమా సన షేక్ లంచ్ కు వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో విజయ్ ను టైట్ గా హగ్ చేసుకోవడం.. అతనికి ముద్దుపెట్టడం వంటివి చేసింది. అంతే కాదు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్న కూడా అతనితో క్లోజ్ గా పోజులిచ్చింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు బీ టౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి