సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. 70 పదుల వయసులోనూ రజినీకాంత్ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఇటీవలే జైలర్, వేటాయన్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు సూపర్ స్టార్.. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్.. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ గా జరుగుతుంది. ఇదిలా ఉంటే రజినీకాంత్ తో సినిమా చేయడం వల్ల నా జీవితం నాశనం అయ్యిందని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పైగా ఆమె చిన్న హీరోయిన్ కూడా కాదు ఆమె ఓ స్టార్ హీరోయిన్.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె.. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మనీషా కొయిరాలా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎంతో మంది అభిమాన హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ.. భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మనీషా కొయిరాలా పేరు మారు మ్రోగిపోయింది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ చిన్నది క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్ తో పోరాడి జయించింది మనీష.. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వల్ల తన కెరీర్నాశనం అయ్యిందని తెలిపింది. రజినీకాంత్ తో కలిసి బాబా సినిమాలో నటించింది మనీషా కొయిరాలా. అయితే బాబా సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది. బాబా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో తనకు సౌత్ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి అని తెలిపింది. బాబా కు ముందు సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ బాబా తర్వాత ఆఫర్స్ రాలేదు అని తెలిపింది మనీషా కొయిరాలా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి