Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చిన్ననాటి స్నేహితుడు కదాని చనువు ఇస్తే.. చీర కొంగుతో ఉరేసి చంపిన ఘనుడు..!

22 June 2025

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో భారీ డిజాస్టర్

22 June 2025

గ్యాప్ ఇవ్వల.. అదే వచ్చింది అంటూ మరల బరిలోకి దిగిన బ్యూటీస్

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srisailam Devotees Cell Phone Signal Problems,శ్రీశైలంలో భక్తులకు కొత్త కష్టాలు.. 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని సంస్థలు! – srisailam devotees faces cell phone signals problems of airtel and jio
ఆంధ్రప్రదేశ్

Srisailam Devotees Cell Phone Signal Problems,శ్రీశైలంలో భక్తులకు కొత్త కష్టాలు.. 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని సంస్థలు! – srisailam devotees faces cell phone signals problems of airtel and jio

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srisailam Devotees Cell Phone Signal Problems,శ్రీశైలంలో భక్తులకు కొత్త కష్టాలు.. 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని సంస్థలు! – srisailam devotees faces cell phone signals problems of airtel and jio
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒక చేదు అనుభవం ఎదురవుతోంది. గత మూడు నెలలుగా అక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా రావడం లేదు. ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడలేక, ఆలయ ప్రాంగణంలో వారు ఎక్కడ ఉన్నారో తెలియక భక్తులు ఆందోళన చెందుతున్నారు. టెలికాం సంస్థలు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..

శ్రీశైలం భక్తులకు కొత్త కష్టాలు
శ్రీశైలం భక్తులకు కొత్త కష్టాలు (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం.. శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి వంటి ప్రత్యేక పర్వదినాల వేళ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వీకెండ్, పండుగల వేళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనానికి తరలి వస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా శ్రీశైలం భక్తులను ఓ సమస్య వెంటాడుతుంది. కానీ దీనిపై సంబంధిత కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు భక్తులకు వచ్చిన ఆ కొత్త కష్టం ఏంటి అంటే..

శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు మొబైల్ సిగ్నల్ కష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. సెల్ వినియోగం పెరిగాక.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు కాల్ చేయకపోయినా.. వారికి కాల్ కలవకపోయినా.. ఆందోళన మొదలవుతుంది. మొబైల్ రింగ్ అయ్యి ఎత్తకపోతే అంత టెన్షన్ ఉండదు. కానీ అసలు కాల్ కనెక్ట్ కాకపోతే.. అబ్బో చాలా కంగారు పడాల్సి వస్తుంది. శ్రీశైలం దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా శ్రీశైలం ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ సరిగా రావడంలేదు.

ఇక తాజాగా నిన్న అనగా శనివారం నాడు కూడా భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్ కష్టాలు తప్పలేదు. జూన్ 21, శనివారం సాయంత్రం నుండి బీఎస్‌ఎన్‌ఎల్‌ తప్ప ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లు పని చేయడం లేదు. సిగ్నల్స్ లేక ఎయిర్‌టెల్‌, జియో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ సమస్య నిన్నటిది మాత్రమే కాదని.. గత మూడు నెలలుగా శ్రీశైలం వచ్చే ఎయిర్‌టెల్‌, జియో వినియోగదారులు సిగ్నల్స్ సమస్య ఎదుర్కుంటున్నారని తెలిసింది.

శ్రీశైలంలో భక్తులకు కొత్త కష్టాలు.. 3 నెలలుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని సంస్థలు!

ఈ సమస్యపై ఇప్పటికే ఎందరో భక్తులు ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు మాత్రం బెల్లం కొట్టిన రాయిలా స్పందించకుండా ఉన్నాయి. శ్రీశైలం వెళ్లే భక్తుల్లో చాలా మందితో పాటుగా.. అక్కడే నివాసం ఉండే స్థానికుల్లో చాలా మంది కూడా ఎయిర్‌టెల్, జియో సిమ్‌లు వాడుతున్నారు. కానీ శ్రీశైలం ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ తప్ప మిగతా సిగ్నల్స్ ఏవి కూడా సరిగా రావడం లేదు. మూడు నెలల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో శ్రీశైలంకు వచ్చిన భక్తులు సిగ్నల్స్ లేక.. తమ కుటుంబీకులు ఎక్కడ వున్నారో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. మరి ఈ సమస్యపై ఆయా సంస్థలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిపిల్లి.ధ‌ర‌ణి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంత‌ర్జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025

Narendra Modi: విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ హర్షం!

22 June 2025

Electric Buses Vijayawada Routes,విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే.! – union government likely to allocate 100 electric buses for vijayawada vidyadharapuram rtc depot

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss

చిన్ననాటి స్నేహితుడు కదాని చనువు ఇస్తే.. చీర కొంగుతో ఉరేసి చంపిన ఘనుడు..!

22 June 2025

వివాహేతర సంబంధంలో ప్రియుడే కాలయముడయ్యాడు. ఇంకొకరితో సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో అమానుషానికి పాల్పడ్డాడు. తనకు దక్కనిది.. ఇంకెవ్వరికీ దక్కకూడదని ఘాతుకానికి…

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో భారీ డిజాస్టర్

22 June 2025

గ్యాప్ ఇవ్వల.. అదే వచ్చింది అంటూ మరల బరిలోకి దిగిన బ్యూటీస్

22 June 2025

మళ్లీ వేడి చేసిన ఆహారాన్ని తింటున్నారా..? ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చిన్ననాటి స్నేహితుడు కదాని చనువు ఇస్తే.. చీర కొంగుతో ఉరేసి చంపిన ఘనుడు..!

22 June 2025

Vishwak Sen: నలుగురు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో భారీ డిజాస్టర్

22 June 2025

గ్యాప్ ఇవ్వల.. అదే వచ్చింది అంటూ మరల బరిలోకి దిగిన బ్యూటీస్

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.