Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Udaipur: ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. అద్భుతమైన ఫోటోలకు బెస్ట్ ఆప్షన్..

22 June 2025

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025

Tollywood: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్న టాలీవుడ్ స్టార్ నటుడు.. అసలు విషయం తెలిసి షాక్.. వీడియో వైరల్

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kalwakurthy Jammalamadugu National Highway,ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు.. – centre allocate 400 crore for nallakalva velugodu road as part of kalwakurthy jammalamadugu 167k national highway
ఆంధ్రప్రదేశ్

Kalwakurthy Jammalamadugu National Highway,ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు.. – centre allocate 400 crore for nallakalva velugodu road as part of kalwakurthy jammalamadugu 167k national highway

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kalwakurthy Jammalamadugu National Highway,ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. తిరుపతికి ఇక దూసుకెళ్లొచ్చు.. – centre allocate 400 crore for nallakalva velugodu road as part of kalwakurthy jammalamadugu 167k national highway
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో మరో జాతీయ రహదారి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కల్వకుర్తి జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంలో మరో అడుగు పడింది. కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి నిర్మాణ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించారు. ఐదో ప్యాకేజీ కింద నల్లకాల్వ – వెలుగోడు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు నిధులు కేటాయించింది. నల్లమల అడవిలో 17 కిలోమీటర్ల మేరకు రెండు వరుసలుగా రహదారి నిర్మాణం జరగనుంది.

ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం..
ఏపీలో కొత్తగా మరో జాతీయ రహదారి.. రూ.400 కోట్లు కేటాయించిన కేంద్రం.. (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి ప్రాజెక్టులోనూ కీలక ముందడుగు పడింది. నల్లకాల్వ – వెలుగోడు రహదారి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించింది. 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయించింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు వరకూ జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కల్వకుర్తి – జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంతో.. హైదరాబాద్ నుంచి తిరుపతికి దూరం కూడా తగ్గనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో కర్నూలు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కల్వకుర్తి- జమ్మలమడుగు 167K జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే.. హైదరాబాద్ నుంచి నంద్యాల మీదుగా తిరుపతికి వెళ్లొచ్చు. దీంతో హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రయాణ దూరం కూడా 70 కిలోమీటర్ల వరకూ తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. కల్వకుర్తి – జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణాన్ని కేంద్రం వివిధ ప్యాకేజీలుగా విభజించింది.

కల్వకుర్తి నుంచి సోమేశ్వరం వరకు ఒకటో ప్యాకేజీగా, సోమేశ్వరం- సంగమేశ్వరం మధ్యన కేబుల్‌ బ్రిడ్జి రెండో ప్యాకేజీగా పనులు చేపడుతున్నారు. సోమేశ్వరం – సంగమేశ్వరం కేబుల్ బ్రిడ్జి కింద అప్రోచ్‌ రోడ్లను మూడో ప్యాకేజీగా నిర్ణయించారు, సంగమేశ్వరం – నల్లకాల్వ, వెలుగోడు – నంద్యాల వరకు నాలుగో ప్యాకేజీగా విభజించారు. నల్లకాల్వ- వెలుగోడు రోడ్డు పనులను 5వ ప్యాకేజీగా నిర్ణయించారు. అయితే ఒకటో ప్యాకేజీ పనులు ఏడాది కిందటే పూర్తి అయ్యాయి. 2, 3, 4వ ప్యాకేజీ పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైంది. ఐదో ప్యాకేజీ అయిన నల్లకాల్వ – వెలుగోడు పనులు ఇన్నిరోజులు ముందుకు సాగలేదు.

నల్లకాల్వ – వెలుగోడు రహదారి నిర్మాణం నల్లమల పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో పలు విభాగాల నుంచి అనుమతులు అవసరం. దీంతో ఈ ప్యాకేజీ పనులలో జాప్యం జరుగుతోంది. అయితే తాజాగా నల్లకాల్వ -వెలుగోడు రహదారి నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయడంతో ఇక పనులు జోరందుకోనున్నాయి.

నల్లకాల్వ- వెలుగోడు మధ్య అడవిలో 17 కిలోమీటర్ల మేర 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలుగా రహదారిని నిర్మించనున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఒకే వరుస రహదారి ఉండగా.. దానిని విస్తరించనున్నారు. తాజాగా కల్వకుర్తి – జమ్మలమడుగు ఐదో ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు కేటాయించటంతో పనులు శరవేగంగా జరగనున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025

Narendra Modi: విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ హర్షం!

22 June 2025

Electric Buses Vijayawada Routes,విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే.! – union government likely to allocate 100 electric buses for vijayawada vidyadharapuram rtc depot

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Udaipur: ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. అద్భుతమైన ఫోటోలకు బెస్ట్ ఆప్షన్..

22 June 2025

సూర్యోదయం సమయంలో పిచోలా సరస్సు: తెల్లవారుజామున, సరస్సు నుంచి ప్రతిబింబించే సూర్యుని బంగారు కిరణాలు సిటీ ప్యాలెస్, సమీపంలోని కొండల…

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025

Tollywood: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్న టాలీవుడ్ స్టార్ నటుడు.. అసలు విషయం తెలిసి షాక్.. వీడియో వైరల్

22 June 2025

Tollywood: ‘అమ్మాయిలతో నీ షూలు విప్పిస్తావా? ఇంకేం యోగా చేస్తావ్‌?’ టాలీవుడ్ హీరోయిన్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Udaipur: ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు ఫొటోగ్రాఫర్లకు స్వర్గధామం.. అద్భుతమైన ఫోటోలకు బెస్ట్ ఆప్షన్..

22 June 2025

పుట్టినరోజని తిరుమలకు వెళ్లిన కుటుంబం.. తిరిగొస్తుండగా.. దారుణం..

22 June 2025

Tollywood: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్న టాలీవుడ్ స్టార్ నటుడు.. అసలు విషయం తెలిసి షాక్.. వీడియో వైరల్

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.