Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఉదయాన్నే ఈ తెల్లటి రసం తాగి చూడండి.. మస్తు ఎనర్జీతో ఉల్లాసంగా ఉంటారు..!

22 June 2025

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

22 June 2025

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Senior Junior Love Anantapur,సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరకు ఇలా..! – anantapur inter first year student and senior girl love story real incident pocso case
ఆంధ్రప్రదేశ్

Senior Junior Love Anantapur,సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరకు ఇలా..! – anantapur inter first year student and senior girl love story real incident pocso case

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Senior Junior Love Anantapur,సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరకు ఇలా..! – anantapur inter first year student and senior girl love story real incident pocso case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


యవ్వనం తెచ్చిన వ్యామోహంలో తప్పటడుగులు వేసిన ఓ యువకుడి జీవితం అనుకోని మలుపులు తిరిగింది. కాలేజీలో ప్రేమ.. పెద్దలు కాదన్నా పెళ్లి.. కానీ, చివరకు తన జీవితం అలా ఊహించని మలుపు తీసుకుంటుందని ఆ యువకుడు కూడా ఊహించలేకపోయాడు. చివరకు పోలీసుల చేతిలో అరెస్టై.. జైలు పాలయ్యాడు. అనంతపురంలో జరిగిన ఈ ఘటన నేటి యువతకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది.

సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు.. చివరకు ఇలా..!
సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు.. చివరకు ఇలా..! (ఫోటోలు– Samayam Telugu)
కలకు, కళకు ఎంతో తేడా ఉంది. అలాగే సినిమాకు, వాస్తవానికి కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. తెలిసీ తెలియని వయసు, ఉడుకు రక్తం, ఏదైనా చేయగలమనే ధీమా, ఎవడ్రా మనల్ని ఆపేదనే మొండి ధైర్యం.. మీసమొచ్చింది ఇక మగాళ్లమై పోయామనే విశ్వాసం.. మెచ్చిన హీరో చెప్పిన డైలాగ్ ఎక్కించిన ఓ రకమైన మదం.. కారణమేదైతేనేం చదువుకోవాల్సిన వయసులో మనసు పక్క చూపులు చూస్తోంది. ఓరకంటి చూపులకు చిక్కి.. బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటోంది. అలా చిన్నవయసులోనే తప్పటడుగులు వేసి.. జైలు గోడల నడుమ చిక్కిన ఓ యువకుడి కథ ఇది. (అనంతపురంలో జరిగిన యదార్థ ఘటన.. పేర్లు మార్చడం జరిగింది)

పదో తరగతి పూరైంది.. పాఠశాల నుంచి జీవితం కళాశాలకు చేరింది. లోకమంతా కొత్తగా.. రంగు రంగులుగా కనిపిస్తోంది. వయసు తాలూకు ప్రభావమో.. శరీరంలోని హార్మోన్ల ఎఫెక్టో.. ఉబికిపడుతున్న యవ్వన మోహమో తెలియదు కానీ.. ఇన్ని రోజులు తాళ్లతో కట్టేసిన మనసు.. సంకెళ్లు విప్పుకుని స్వేచ్ఛగా విహరిస్తున్నట్లుంది మోహన్‌కి. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టాడు. అన్నీ తెలియని ముఖాలు.. ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంతా గజిబిజిగానే ఉన్నా., మనసెందుకో సంతోషంగా ఉంది. రకరకాల పువ్వులతో కలకలలాడుతున్న ఉద్యానవనంలోకి అడుగుపెట్టిన సీతాకోకచిలుకలా.. పురివిప్పుకుని ఎగురుతోంది. ఎటు చూసినా తెలియని ముఖాలే.. ఆ తెలియని ముఖాల మధ్యలో చటుక్కున అలా మెరిసిందో తార.. ఎప్పుడూ చూడని మొహమే.. ఎన్నడూ ఎరుగని నవ్వే..కానీ, ఎంతో పరిచయమున్న వ్యక్తిలా అనిపించింది.

రోజులు గడుస్తున్నాయి. పరిచయం లేని ఆ ముఖంలో కనిపించే నవ్వుల కోసం మోహన్ చూపులు కాలేజీ అణువణువూ వెతుకుతున్నాయి. ఓ రోజు అనుకోకుండా చూపులు కలిశాయి. ఆ తర్వాత మాటలు కలిశాయి. మాటల మధ్యన తెలిసిందేంటంటే మోహన్ కన్నా తను సీనియర్. మోహన్ ఇంటర్ మొదటి సంవత్సరం అయితే.. తను సెకండియర్. కానీ అదేదీ వారి మాటలకు అడ్డు రాలేదు. ఆ మాటలు కాస్తా సెల్‌ఫోన్ ముచ్చట్లుగా మారాయి. ఆ సెల్ ఫోన్ ముచ్చట్లే ప్రేమకు దారితీశాయి. తనది ఇంటర్ పూర్తి అయ్యింది. ఇంట్లో వాళ్లు చదువు ఆపేయించారు. ఇంటి దగ్గరే ఉండిపోయింది. అయితే మోహన్‌తో మాత్రం ప్రేమ ముచ్చట్లు ఆపలేదు. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల కంటబడింది.

ఇంకేముంది.. అందరు తల్లిదండ్రుల లాగానే వీరు కూడా ఆలోచించారు. మంచి అయ్యను చూసి పెళ్లి చేస్తే.. సరిపోతుందనుకున్నారు. పెళ్లి సంబంధాలు వెతకడం మొదలెట్టారు. కానీ ఈ ప్రేమ జంట.. మరో నిర్ణయం తీసుకుంది. ఇద్దరి కుటుంబాల్లోనూ చెప్పకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తమ జీవితం, తమ పెళ్లి, తమ ఇష్టం అనుకుని పెద్దలకు చెప్పకుండా ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన ఈ జంట బాపట్ల జిల్లా చేరింది. చీరాలలో అద్దెకు దిగింది. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించారు. కానీ రెండు నెలలు గడిసేసరికి.. వీరు అనుకున్నవన్నీ తల్లకిందులయ్యాయి. మనమొకటి తలిస్తే.. దేవుడొకటి తలుస్తాడని అంటారు కదా.. అలాగే..

అమ్మాయి కుటుంబసభ్యులు తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులోనే ప్రేమ జంట.. చీరాలలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. అమ్మాయిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. మోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. అలా చిన్న వయసులోనే ప్రేమ మత్తులో తప్పటడుగులు వేసిన మోహన్ జీవితం.. జైలుపాలయ్యింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

22 June 2025

Sajjala Ramakrishna Reddy Criminal Case,YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. – ysrcp leader sajjala ramakrishna reddy criminal case at tadepalli police station against amaravati comments

22 June 2025

Kurnool Surveyor Murder Case,కర్నూలు: పెళ్లైన నెలకే సర్వేయర్ దారుణ హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు – gadwal newlyweds surveyor murder in nandyal district case updates

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఉదయాన్నే ఈ తెల్లటి రసం తాగి చూడండి.. మస్తు ఎనర్జీతో ఉల్లాసంగా ఉంటారు..!

22 June 2025

తెల్ల గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి నరాలకు శక్తిని ఇస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతాయి. దాంతో ఉదయాన్నే…

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

22 June 2025

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

22 June 2025

IND vs ENG 1st Test: లీడ్స్‌లో బుమ్రా పాంచ్ పఠాకా.. 6 పరుగుల ఆధిక్యంలో భారత్.. ఉత్కంఠగా తొలి టెస్ట్

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఉదయాన్నే ఈ తెల్లటి రసం తాగి చూడండి.. మస్తు ఎనర్జీతో ఉల్లాసంగా ఉంటారు..!

22 June 2025

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం!

22 June 2025

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.