మంచి జీర్ణశక్తి కోసం మనం చాలా మందులు వాడతాం. అయితే ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగితే గ్యాస్, అజీర్ణం, పేగుల నొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను సరిగ్గా ఉంచుతుంది. దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమై శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
పసుపులో ముఖ్యమైన పదార్థం కర్కుమిన్ గుండెకు చాలా మంచిది. ఇది రక్తనాళాల్లో ఉండే వాపును తగ్గించడంలో సాయపడుతుంది. దాంతో రక్తం బాగా ప్రవహిస్తుంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే చెడు కొవ్వును తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
రోజులు గడిచే కొద్దీ మన మెదడు పనితీరు నెమ్మదించవచ్చు. అయితే పసుపులో ఉండే ఆక్సిడెంట్లు మెదడుకు తగిన ఆక్సిజన్ ను ఇస్తాయి. అల్జీమర్స్ లాంటి నరాల జబ్బులను తగ్గించడంలో పని చేస్తాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉండటానికి సాయపడుతుంది.
వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు పెరుగుతాయి. పసుపు నీటిని తరచుగా తాగడం వల్ల ఈ రకమైన శరీర వాపులు తగ్గుతాయి. ఇది శరీరంలో వచ్చే ఇన్ ఫ్లమేషన్ ను నియంత్రించే సహజ పద్ధతి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఇది సాయపడుతుంది.
బయటి సౌందర్య క్రీములు వాడకుండా సహజంగా చర్మం మెరిసిపోవాలంటే పసుపు నీళ్లు మంచి ఎంపిక. ఇది చర్మానికి లోపలి నుంచి పోషణను ఇస్తుంది. మొటిమలు, మచ్చలు, వయసుతో వచ్చే ముడతలు లాంటి సమస్యలను తగ్గించి చర్మానికి కాంతిని తీసుకురావడంలో సాయపడుతుంది.
మానవ శరీరంలో రక్షణ వ్యవస్థ బలంగా లేకపోతే చిన్న చిన్న జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరానికి వైరస్ లు, బ్యాక్టీరియాలు రాకుండా సాయపడుతుంది. ఇది శరీరానికి సహజ రక్షణ కవచంలా మారుతుంది.
మీ రోజూవారీ జీవితంలో పసుపు నీటిని చేర్చుకోవడం ఒక చిన్న మార్పులా కనిపించవచ్చు. కానీ దీని ప్రభావం చాలా గొప్పది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహజ మార్గాలను ఎంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది సరైన డ్రింక్.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)