బెండకాయను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరు తాగాలి, ఎవరు తాగకూడదు అన్నదానిపై పూర్తి అవగాహన ఉండాలి. బెండకాయలో ఎక్కువగా ఉండే ఫైబర్ పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. దీని వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అజీర్తి లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బెండకాయలో గ్లూకోజ్‌ను శరీరం తీసుకోకుండా తగ్గించే గుణం ఉంది. ఇది షుగర్‌ను అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండెకు రక్షణ ఇస్తాయి. రక్తనాళాల్లో వాపు తగ్గి గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది.
బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K లాంటి పోషకాలు చాలా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిగా అయ్యేలా చేస్తాయి. ఈ నీళ్లు తాగిన తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ఆకలి తగ్గి ఎక్కువ ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దాంతో బరువు అదుపులో ఉంటుంది.
బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ముడతలు, మొటిమలు తగ్గడంలో సాయపడతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
బెండకాయ నీటితో సమస్యలు
- వాంతులు, గ్యాస్, కడుపు ఉబ్బరం.. ఎక్కువ ఫైబర్ వల్ల కొందరికి అజీర్తి లాంటి ఇబ్బందులు రావచ్చు.
- అలర్జీ వచ్చే అవకాశం.. కొందరు బెండకాయకు అలర్జీ కలిగి ఉంటారు. అలాంటి వారు ఈ నీటిని తాగకూడదు.
- ఫ్రక్టోజ్ వల్ల అసౌకర్యం.. బెండకాయలో ఉండే ఫ్రక్టోజ్ వల్ల కొందరికి గ్యాస్, అసౌకర్యం కలగవచ్చు.
- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జాగ్రత్త.. ఇందులో ఉండే ఆక్సలేట్ పదార్థం రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
బెండకాయ నీళ్ల తయారీ విధానం
- ఐదు తాజా బెండకాయలు తీసుకోండి. వాటి చివర్లు కట్ చేసి మధ్యలో చీల్చండి.
- వీటిని రెండు గ్లాసుల నీటిలో రాత్రంతా నానబెట్టండి.
- ఉదయం ముక్కలను తీసివేసి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగండి.
బెండకాయ నీళ్లు సహజంగా ఆరోగ్యాన్ని పెంచే ఒక మంచి మార్గం. కానీ దీన్ని రోజూ తీసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితులను ఆలోచించుకోండి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)