దిన ఫలాలు (జూన్ 23, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగానే సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం ఎక్కువగా, ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వీరి సలహాలు, సూచనలతో పాటు, మీ పనితీరు కూడా అధికారులకు నచ్చుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగానే సాగిపోతాయి. కుటుంబంలో చిన్నా చితకా సమస్యలుండే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కుటుంబం విషయంలో కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూల ఫలితానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలుంటాయి. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. పిల్లలు నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రోజంతా చీకూ చింతా లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి యథా ప్రకారం కొనసాగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుం బంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవ కాశాలు కూడా అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ముఖ్యమైన పనులన్నీ పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఉద్యోగంలో తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. సమాజంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ఒత్తిడి తగ్గుతుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఆశించిన శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా ఆర్థికంగా బాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది.