పైన ఫోటోలో తన సోదరుడి చేతుల్లో నవ్వుతూ ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న స్టార్. సినిమాల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తుంది. ఇప్పటివరకు దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ తమన్నా. తన సోదరుడు ఆనంద్ భాటియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమన్నా ఈ చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన వజ్రాల వ్యాపారి సంతోష్, రజిని భాటియా దంపతుల కుమార్తె తమన్నా.
2015లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తమన్నా విజయ్, మహేష్ బాబు, అజిత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. తమన్నా దక్షిణ భారతదేశంలో ప్రముఖ నటి.
తమిళం, తెలుగు, బాలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
2017లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2: ది కన్క్లూజన్ తర్వాత తమన్నా పెద్దగా ప్రాజెక్టులు చేయడం లేదు. 2024లో సికిందర్ కా ముఖద్దర్, ఆఖ్రీ సచ్ వంటి చిత్రాల్లో మెరిసింది. తమన్నా కొన్ని సంవత్సరాలుగా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.