Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్ లో ఉంటది.. ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు..!

23 June 2025

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»నారా లోకేష్,బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి? – political analyst telakapalli ravi predicts nara lokesh to become ap chief minister with pm modi blessings
ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్,బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి? – political analyst telakapalli ravi predicts nara lokesh to become ap chief minister with pm modi blessings

.By .23 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
నారా లోకేష్,బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి? – political analyst telakapalli ravi predicts nara lokesh to become ap chief minister with pm modi blessings
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. అలాగే నారా లోకేష్ యోగా డే వేడుకల కోసం చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషించే ఆయన యోగా డే వేడుకలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..?
బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? (ఫోటోలు– Samayam Telugu)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. అలాగే నారా లోకేష్ యోగా డే వేడుకల కోసం చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషించే ఆయన యోగా డే వేడుకలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షల మంది పాల్గొన్న విశాఖ యోగా డే వేడుకలు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కాయి. అయితే విశాఖ యోగా డే కార్యక్రమం ద్వారా ఒకరికి సీఎం పదవీ యోగం పట్టబోతోందంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి. యోగా డే ద్వారా నారా లోకేష్‌కు సీఎం యోగం పట్టనుందని ఆయన అంచనా వేశారు. దీని వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ తెలకపల్లి రవి మాట్లాడిన వీడియో చర్చనీయాంశంగా మారింది.

‘‘విశాఖపట్నం యోగా వేడుకల ద్వారా.. అందులో పాల్గొన్న వారందరికీ ఆయురారోగ్యాలు ఎంత మేరకు లభిస్తాయనేదీ పక్కనబెడితే.. తెలుగుదేశం వాళ్లు ఆశిస్తున్నట్లుగా టీడీపీ నేతగా ఆవిర్భవించబోతున్న నారా లోకేష్‌‍కు మాత్రం పూర్తిగా కలిసి వచ్చింది. యోగా డే ద్వారా నారా లోకేష్‌కు సీఎం పదవీ యోగం, పార్టీ నాయకత్వం యోగం ఆయన ముందు నిలిచాయి. విశాఖ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోకేష్ భాయ్, లోకేష్ భాయ్ అని అన్నిసార్లు అన్నారంటే అది మామూలు విషయం కాదు. సాధారణంగా మోదీ అలా అనరు. అన్ని రాష్ట్రాలలోని యువ నాయకత్వాన్ని, ప్రాంతీయ పార్టీల యువ నాయకులను మోదీ ప్రత్యేకంగా చేరదీస్తున్నారు. దీని ద్వారా యువ శ్రేణిని నరేంద్ర మోదీ నిర్మిస్తున్నారు.’’ అని తెలకపల్లి రవి వివరించారు.అయితే నారా లోకేష్, బీజేపీ మైత్రి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏర్పడిందని తెలకపల్లి రవి చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మైత్రి మరింత బలపడిందని అంటున్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనాయకత్వం.. నారా లోకేష్‌తో లోక్‌సభ ఎన్నికలకు ముందే అనుసంధానం చేసుకున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి సహాయంతో నారా లోకేష్.. అమిత్‌ షాను కలిశారు. అప్పటి నుంచి బీజేపీ, టీడీపీ సఖ్యత పెరిగింది. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా టీడీపీ, బీజేపీ జనసేన పొత్తులో ఉంది. కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తులో కీలక పాత్రధారి ఎవరంటే నారా లోకేషే. ” అని తెలకపల్లి రవి అన్నారు.

‘‘ఎన్నికలు పూర్తైన తర్వాత అక్టోబర్ నెలలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్‌లో నారా లోకేష్ ఓ మాట చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు ఇస్తానని మోదీకి చెప్పానని.. కానీ ఒక్క సీటు తగ్గిందని, అందుకు సారీ చెప్తున్నానని నారా లోకేష్ ఆ రోజు అన్నారు. దీని ప్రకారం వారి మధ్య అవగాహన ఎలా ఉందో తెలుస్తుంది. అలాగే నరేంద్ర మోదీ అమరావతికి వచ్చినప్పుడు, విశాఖపట్నానికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్‌ను.. ఢిల్లీ వచ్చి నన్నెందుకు కలవడం లేదంటూ చాలాసార్లు అన్నారు. మే నెలాఖరులో నారా లోకేష్ కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లి మోదీని ఆయన ఇంట్లో కలిశారు. ఇదంతా మర్యాదపూర్వకంగా కనిపించినా.. అంతకుమించిన రాజకీయ సంకేతం అందులో ఉంది.’’

‘‘యోగా కార్యక్రమంలో నారా లోకేష్ కీలకంగా ఉన్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా లేదు. విశాఖపట్నంలో జరిగిన యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని.. నారా లోకేష్‌ను అభినందించిన తర్వాత నారా లోకేష్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. విశాఖ యోగా డే వేడుకలు గిన్నిస్ రికార్డులకు ఎక్కటంతో మరింత పెరిగింది. దీంతో ప్రధాని మోదీకి ఈ గిన్నిస్ రికార్డు తమ గిఫ్టు అంటూ టీడీపీ చెప్తోంది. అటు మోదీ నుంచి రిటర్న్ గిఫ్టు ఏంటంటే.. నారా లోకేష్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధం చేయడమే. నారా లోకేష్‌ను ఎప్పుడైనా సీఎం చేసుకోవచ్చు.. మాకేమీ అభ్యంతరం లేదని ప్రధాని మోదీ, అమిత్ షా పచ్చజెండా ఊపారని.. విశాఖపట్నంలో నారా లోకేష్‌కు మోదీ అభినందనలే ఆశీర్వాదాలని అనుకోవచ్చు’’ అని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.

మరోవైపు కడప మహానాడు ద్వారా నారా లోకేష్‌కు ఎలివేషన్ వచ్చిందన్న తెలకపల్లి రవి.. ఇక డిక్లరేషన్ మాత్రమే మిగిలిందని అన్నారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మీ పార్టీ, మీ ఇష్టం అన్నట్లుగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు పాత్ర వేరు. ఎన్నికల తర్వాత వేరు. నారా లోకేష్ పట్టాభిషేకానికి రంగం పూర్తిగా సిద్ధమైంది అంటూ తెలకపల్లి రవి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే ఆ మధ్య శాసన సభ్యులకు నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. లోకేష్ సైతం తన తండ్రే సీఎంగా కొనసాగుతారని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం అయినప్పటికీ.. తెర వెనుక లోకేష్ చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు ఏపీ ప్రజలు కూటమి వైపు మొగ్గిందే బాబు అనుభవం చూసి. కొడుక్కి సీఎం పగ్గాలు అప్పగిస్తే.. తర్వాత చంద్రబాబు ఏం చేస్తారు? కూటమి సర్కారు ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. అంటే హనీమూన్ ముగిసింది. రాబోయే మూడేళ్లు ప్రభుత్వానికి ఎంతో కీలకం. రెండోసారి అధికారంలోకి రావాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం కూటమికి ఎంతో అవసరం. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. మరోవైపు జగన్ అదును కోసం కాచుకొని కూర్చొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ను సీఎంగా ప్రమోట్ చేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

AP Govt Financial Help To Auto Drivers,ఆటోడ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన.. ఆ రోజే ప్రారంభం.. – ap cm nara chandrababu naidu announce financial assistance to auto drivers on august 15

23 June 2025

Andhra Pradesh: మామిడిపండ్లు కొనేవారి కోసం రోడ్డుపై పడిగాపులు కాస్తున్న రైతులు.. ఆహారం అందించిన నటుడు

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్ లో ఉంటది.. ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు..!

23 June 2025

కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఉదాహరణకు గుడ్లు,…

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025

Indian Railways: ప్రయాణం మధ్యలో మరణిస్తే.. రైల్వే ఇచ్చే పరిహారం ఎంత? నిబంధనలు ఇవే..

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్ లో ఉంటది.. ఇక టెన్షన్ పడాల్సిన పనిలేదు..!

23 June 2025

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

23 June 2025

Chandrababu On Banakacherla,బనకచర్ల ప్రాజెక్టు: అవకాశం ఇద్దరికీ ఉంది.. కలిసి వాడేసుకుందాం.. తెలంగాణకు చంద్రబాబు సూచన – cm chandrababu naidu said there is no loss to telangana due to banakacharla project

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.