గదిలో స్థిరమైన చల్లదనాన్ని అందించడంతో పాటు విద్యుత్ బిల్లులను నియంత్రించుకోవాలనుకునే వారు డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఏసీని కొనుగోలు చేయవచ్చు. సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల పరిమాణం గల గదులకు చాలా బాగుంటుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీలలో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్ ఇదే. దుమ్ము నుంచి రక్షించే పీఎం 2.5 ఫిల్టర్, నిద్రకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని 38 డీబీ తక్కువ శబ్ద స్థాయి, అవసరమైనప్పుడు త్వరిత చల్లదనాన్ని అందించే చిల్ ఫంక్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఏసీని 44,299కి కొనుగోలు చేయవచ్చు.
మీడియం సైజు గదులతో పాటు ఏసీని తక్కువగా వినియోగించే వారికి గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఫిక్సడ్ స్పీడ్ స్ప్లిడ్ ఏసీ సరిపోతుంది. రాగి కండెన్సర్ తో కారణంగా మన్నిక విషయంలో ఢోకా ఉండదు. స్వచ్ఛమైన గాలిని అందించే అంతర్నిర్మిత యాంటీ డస్ట్ ఫిల్టర్, గది అంతటా ఓకే విధమైన చల్లదనం అందించే 4 వే ఎయిర్ స్వింగ్ టెక్నాలజీ, 42 డీబీ తక్కువ శబ్దస్థాయి, 1045 యూనిట్ల వార్షిక శక్తి వినియోగం, ఉష్ణోగ్రత, ఫ్యాన్ వేగాన్ని నియంత్రించుకోవడానికి రిమోట్ కంట్రోల్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
మిడియం సైజు గదుల కోసం హిటాచీ 1.5 టన్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ చక్కగా సరిపోతుంది. నలుమూలలకు చక్కని గాలిని ప్రసరింపజేస్తుంది. ఎండ ఎక్కువగా ఉన్నా గదిలో చల్లదనాన్ని కాపాడుతుంది. రాగి గ్రూవ్డ్ ట్యూబుల కారణంగా మన్నిక విషయంలో తిరుగులేదు. 39 డీబీ కంటే తక్కువ శబ్ద స్థాయి, అంతర్నిర్మిత ధూళి ఫిల్టర్, 3 స్టార్ బీఈఈ రేటింగ్, దుర్వాసన లేని గాలిని అందించే ఆటోకాయిల్ డ్రై టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. ఈ ఏసీని అమెజాన్ లో రూ.39,090కి కొనుగోలు చేయవచ్చు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఓ – జనరల్ ఫిక్స్ డ్ స్పీడ్ ఏసీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సుమారు 55 డిగ్రీల ఎండలోనూ చల్లదనాన్ని అందిస్తుంది. ఈ 1.5 టన్ 3 స్టార్ ఫిక్స్ డ్ స్పీడ్ స్ల్పిట్ ఏసీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. రాగి కండెన్సర్ కాయిల్ తో ధీర్ఘకాలం మన్నుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ తో దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. ఆటో రీస్టార్ట్ మోడ్, ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో హెచ్చుతగ్గులు లేని చల్లదనాన్ని పొందవచ్చు. 34 డీబీ శబ్ధ స్థాయి, ఏడాదికి 1068 యూనిట్ల వార్షిక శక్తి వినియోగం దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో రూ.51,950 ధరకు ఈ ఏసీ అందుబాటులో ఉంది.
గదికి అందాన్నివ్వడంతో పాటు తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన ఏసీ కావాలనుకునే వారికి వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ బాగుంటుంది. రాత్రి సమయంలో ఇబ్బంది పెట్టని ఎల్ఈడీ డిస్ ప్లే, గది అంతటా చల్లదనాన్ని అందించే కంప్రెసర్, దుమ్ము నుంచి కాపాడే యాంటీ డస్ట్ ఫిల్టర్, 3 స్టార్ బీఈఈ ఎనర్జీ రేటింగ్ దీని ప్రత్యేకతలు, 4900 వాట్ల వార్షిక శక్తి వినియోగం, రాగి కండెన్సర్ కాయిల్ బాగున్నాయి. మన్నిక, నాణ్యత కలిగిన ఏసీ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. అమెజాన్ లో రూ.37,890కి ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు.