ఆరోగ్యకరమైన ఆహారం ట్రెండ్ అవుతున్న నేటి కాలంలో.. రుచి విషయంలో ఎవరూ రాజీ పడడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో.. మీరు రుచికరమైన , ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని భావిస్తే.. ఓట్స్ తో ట్రై చేయండి. అది ఎలా ఉంటుంది? మసాలా ఓట్స్ ఉత్తపం అటువంటి ఫ్యూజన్ వంటకం. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాదు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్ సమయానికి కూడా సరైనది. దీనిని పెద్దలు మాత్రమే కాదు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారు కూడా తినడానికి ఇష్టపడే వంటకం. ఈ రోజు సులభమైన అల్పాహారమైన మసాలా ఓట్స్ ఊతప్పం రెసిపీ గురించి తెలుసుకుందాం.
మసాలా ఓట్స్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు
- ఓట్స్ – 1 కప్పు( మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి)
- సెమోలినా(సుజీ రవ్వ) – అర కప్పు
- పెరుగు – అర కప్పు
- నీరు – అవసరమైనంత
- ఉప్పు – రుచి సరిపడా
- ఈనో లేదా బేకింగ్ సోడా – 1/2 టీస్పూన్
- ఉల్లిపాయ – 1 సన్నగా తరిగినది
- టమోటా – 1 సన్నగా తరిగినది
- పచ్చిమిర్చి – 1 సన్నగా తరిగినది
- కాప్సికమ్ – అర కప్పు సన్నగా తరిగినది
- కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
- చాట్ మసాలా – రుచికి తగినంత
- నూనె – వేయించడానికి సరిపడా
ఇవి కూడా చదవండి
మసాలా ఓట్స్ ఉత్తపం తయారీ విధానం:
- ఒక గిన్నెలో ఓట్స్ పొడి, సెమోలినా, పెరుగుని వేసి బాగా కలపండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి పిండిని సిద్ధం చేయండి. ఈ మిశ్రమంపై మూత పెట్టి ఒక పక్కకు పెట్టండి.
- సుమారు 15 నుంచి 20 నిముషాలు మూత పెట్టి పక్కకు పెడితే పిండి ఉబ్బుతుంది.
- ఈలోగా ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే క్యారెట్ లేదా ఉడికించిన మొక్కజొన్న గింజలను కూడా జోడించవచ్చు.
- ఇప్పుడు ఓట్స్ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు కలిపి, ఈనో లేదా బేకింగ్ సోడా వేయండి. ఈనో కలిపిన వెంటనే పిండి ఉబ్బుతుంది..
- వెంటనే స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడి చేసి.. దానిపై కొంచెం నూనె వేయండి. ఇప్పుడు ఒక చెంచాతో పిండిని గుండ్రంగా వేసి.. ఆ పిండిపై తరిగిన కూరగాయలను వేసి ఆపై కొంచెం చాట్ మసాలా చల్లుకోండి.
- పాన్ కి మూతపెట్టి మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించి.. ఆపై దోశను తిప్పి రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు కాల్చండి.
- అంతే మసాలా ఓట్స్ ఉత్తప్పం రెడీ. దీనిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ లేదా టమోటా సాస్ తో వేడి వేడిగా వడ్డించండి. ఈ టిఫిన్ పిల్లల టిఫిన్, డైట్ పాటించే వ్యక్తులు లేదా డయాబెటిక్ రోగులకు కూడా ఆరోగ్యకరమైన ఎంపిక.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..