
గంజాయి స్మగ్లర్ల బరితెగిస్తున్నారు.. స్మగ్లింగ్ చేసేందుకు అవసరమైన అన్ని అడ్డ దారులు తొక్కుతున్నారు.. కొన్నిసార్లు గుర్తు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు.. మరికొన్నిసార్లు పోలీసులకు చిక్కిపోతున్నారు.. అయితే ఈసారి గంజాయి స్మగ్లర్లు మరో అడుగు ముందు చేశారు. ఎవరైనా అడ్డొస్తే అంతం చేసేందుకైనా వెనుకడకుండా పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిపోయారు.. పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తే ఓ టూ వీలర్ ను ఏకంగా ఢీకొని పారిపోయే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు ఊరుకుంటారా..? వెంటాడి వెంటాడి మరి పట్టుకున్నారు.. సినీ స్టైల్ లో చేజింగ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గంజాయి స్మగ్లర్ల హల్ చల్ చేశారు. రెండు కార్లలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో.. నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద కాపు కాసారు. వాహనాలను చెక్ చేస్తూ ఉన్నారు. విషయాన్ని గుర్తించిన స్మగ్లర్లు.. తమ కారును యూటర్న్ చేశారు… వెదుళ్ళ పాలెం వద్ద హై స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. పోలీసులు కూడా వారిని చూసి చేజింగ్ చేశారు. సినీ స్టైల్ లో వెంబడించారు.. ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్లు అటుగా వెళుతున్న ఓ టూ వీలర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో శ్రీనివాసరావు అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ బైక్ను ఢీ కొట్టిన వెంటనే కారును ఆపి.. స్మగ్లర్ పారిపోయాడు. కానీ మరో కారును వెంబడించి మరి పట్టుకున్నారు పోలీసులు. రెండు కార్లలో 369 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన నరేంద్ర అనే స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు నక్కపల్లి పోలీసులు.
కారు నెంబర్ ప్లేట్లను మార్చి..
యూపీ కి చెందిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులను ఏ మార్చేందుకు సరికొత్త ఐడియాలకు పదును పెడుతున్నారు. ఢిల్లీకి చెందిన కార్లను వినియోగించి.. వాటిని ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అతికిస్తున్నారు. తాజాగా పట్టుబడిన రెండు కార్లు కూడా.. ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఢిల్లీ.. కానీ పైకి కనిపిస్తున్నాయి మాత్రం ఆంధ్ర రిజిస్ట్రేషన్ తో నెంబర్ ప్లేట్లు ఉన్నాయని అంటున్నారు డిఎస్పి శ్రీనివాసరావు. ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు డిక్కీలో కనిపించాయని అన్నారు.
హత్య చేసేందుకైనా..
పోలీసుల విచారణలో కీలక విషయాల వెలుగులోకి వెలుగులోకి వచ్చాయి. గంజాయి తరలించే క్రమంలో అడ్డుకున్న వారిని అంతం చేసేందుకైనా గంజాయి స్మగ్లర్లు ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎవరు అడ్డొచ్చినా హత్య చేసి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అందులో భాగంగానే పారిపోతున్న తమ దారికి అడ్డుగా ఉన్న.. బైకును ఢీకొని తీవ్రంగా గాయపరిచారని అన్నారు డీఎస్పీ శ్రీనివాసరావు. గాయపడిన శ్రీనివాసరావు చేయి ఫ్రాక్చర్ కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నామని అన్నారు డిఎస్పి. పారిపోయిన నిందితుడితోపాటు.. వారికి సహకరించిన వారికోసం ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దింపి అరెస్టు చేస్తామన్నారు.