మధ్యప్రాచ్యంలో మధ్యవర్తి పాత్రతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెడ్‌లైన్స్‌కు ఎక్కాడు. అంతా తానే చేశానని చెప్పుకుంటూ.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని, తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. మరి ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నట్టు..? ముుందు ఎందుకు రెచ్చగొట్టినట్లు ? తర్వాత సీజ్ ఫైర్ ఘనత తనదేనని ఎందుకు చెప్పుకుంటున్నట్లు.? ట్రంప్ ఈ ఆట ఎందుకు ఆడుతున్నారు? నోబెల్ శాంతి బహుమతి కోసమా, లేక అమెరికా ప్రయోజనాల కోసమా? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే వివాదాలే గుర్తుకువస్తాయి. ఆయన విదేశీ విధానాలు ఎప్పుడూ సంచలనమే. ఇందుకు ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌లో ట్రంప్ పాత్రే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇరాన్ అన్కండీషనల్గా సరెండర్ కాకుంటే.. కొత్త లక్ష్యాలపై దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కథ ఖతం అన్న సంకేతాలు కూడా ఇజ్రాయెల్‌వైపు నుంచి ఇచ్చాడు. బట్, ఇదంతా బ్లఫ్ గేమ్ అంటున్నారు నిపుణులు. వారించేదీ ఆయనే, వాదించేది ఆయనే.. ఇప్పుడు వార్ వద్దని చెప్పేదీ ఆయనే..! గిల్లడం-గిచ్చడం, తర్వాత ఆయింట్మెంట్ పూయడం..అణుయుద్ధాన్ని ఆపిన ఘనత తనదేనని చివర్లో శుభం కార్డు తన పేర వేయిుంచుకోవడం.. తద్వారా ప్రపంచ శాంతికాముకుడిగా పేరు తెచ్చుకోవడం.. ట్రంప్ రాజకీయ చర్యల్లో పరిపాటిగా మారింది.
ఈ రెండు వారాల్లో ట్రంప్ ఆడిన గేమ్ మామూలు గేమ్ కాదు. యుద్ధంతో జరిగేది నష్టమేనని తెలుసు. కానీ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్‌ను కీలుబొమ్మలను చేసి ఆడించారంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. పోనీ ఇరాన్ ఇప్పుడేమైనా వెనక్కి తగ్గి న్యూక్లియర్ యాక్టివిటీస్‌ను తగ్గిస్తామని చెప్పిందా? అంటే అదీలేదు, మరెందుకు స్టార్ట్ చేసినట్లు..? ఎందుకు విరమించినట్లు ? అమెరికా ఆడిన గేమ్‌లో సమిధులైంది సామాన్య పౌరులే. పోనీ పూర్తిగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయా అంటే అదీలేదు. సీజ్ ఫైర్ అమల్లో ఉన్నా, ఇంకా అక్కడ మిస్సైళ్ల వర్షం కురుస్తూనే ఉంది. దీనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్.
ఇలా ప్రతి దాంట్లో వేలు పెట్టడం.. రచ్చరాజేయడం.. తర్వాత సీజ్ ఫైర్ అంటూ ఇద్దరిని బుజ్జగించి, పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు అమెరికా అధ్యక్షుడిపై రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలా ఇజ్రాయెల్-ఇరాన్, ఉక్రెయిన్-రష్యా, భారత్-పాకిస్తాన్ సంఘర్షణల్లో ట్రంప్ చర్యలు వివాదాస్పదంగా మారాయి. జూన్ 23న ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మిస్సైళ్ల వాన కురిసింది. ట్రంప్.. ఇజ్రాయెల్‌ను రెచ్చగొట్టి, ఇరాన్‌పై దాడులకు పురిగొల్పి, తర్వాత శాంతి స్థాపకుడిగా కనిపించే ప్రయత్నం చేశారన్నది విమర్శకుల మాట. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలోనూ ట్రంప్ చర్చలు జరిపేందుకు మధ్యవర్తిగా వ్యవహరించారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఇక భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించినట్లు ట్రంప్ తనకు తాను చెప్పుకున్నారు.
2018లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికాను తప్పించారు. ఇది ఇరాన్-ఇజ్రాయెల్ శత్రుత్వాన్ని పెంచింది. 2020లో ఇరాన్ జనరల్ కాసెం సోలేమానీ హత్యకు ఆదేశించారు. దీనివల్ల ఇరాన్ ఖతార్‌లో అమెరికా స్థావరంపై దాడి చేసింది. 2018-19లో ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. కానీ అణ్వాయుధ కార్యక్రమం ఆగలేదు. ఉక్రెయిన్-రష్యా సంఘర్షణలో 2019లో ట్రంప్ ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపారు. దీనివల్ల రాజకీయ వివాదం రేగింది. భారత్-పాక్ మధ్య 2019లో కాశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పారు. అందుకు భారత్ తిరస్కరించింది. ఇవన్నీ రెచ్చగొట్టి, శాంతి చర్చల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలన్నది డొనాల్డ్ ట్రంప్ వ్యూహమన్నది విశ్లేషకుల మాట.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ విరమణ ప్రకటనలో గమనించాల్సిన విషయం ఒకటుంది. జూన్ 21న డొనాల్డ్ ట్రంప్ తనను తాను నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేసుకున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటన.. నామినేషన్ తర్వాతే వచ్చాయి. సో.. ఇదంతా నోబెల్ కోసం ట్రంప్ ప్లే చేస్తున్న వార్ గేమ్‌గా చూస్తున్నారు విమర్శకులు. పైగా పాకిస్తాన్ కూడా ట్రంప్ మాటలకు వంతపాడుతోంది. నోబెల్ బహుమతి ట్రంప్ అర్హుడంటా పొగడ్తల వాన కురిపిస్తోంది. సో.. ఇదంతా ట్రంప్ నోబెల్ కోసం అడుతున్న వార్ గేమ్ గానే కనిపిస్తోందన్నది విశ్లేషకుల మాట.
అయితే చరిత్రలో ట్రంప్ జోక్యం చేసుకున్న ఏ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి శాంతి స్థాపన జరగలేదంటున్నారు నిపుణులు. నోబెల్ పీస్ ప్రైజ్‌కు ట్రంప్ అనర్హుడంటున్నారు ఆయన వ్యతిరేకులు. గతంలోనూ అబ్రహం ఒప్పందాలు, ఉత్తర కొరియా చర్చలను నోబెల్ బహుమతి కోసం తెగ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు భారత్-పాక్, ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు క్లెయిమ్ చేసుకుని నోబెల్ ప్రైజ్ కొట్టేయాలన్నది ట్రంప్ ప్లాన్ గా కనిపిస్తోంది. మరి ట్రంప్ నోబెల్ ఆశలు ఈసారి నెరవేరుతాయా..? నోబెల్ కమిటీ ట్రంప్ చర్యలను గుర్తిస్తుందా.? అన్నది చూడాలి..!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..