ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది అందాల భామ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది శ్రీలీల. తొలి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో చేసింది ఈ చిన్నది. ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత శ్రీలీల చేసిన సినిమాలేవీ బాక్సాఫిస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నప్పటికీ ఈ అమ్మడి అనుకున్నంత సక్సెస్ మాత్రం రాలేదు. భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ ఆ హిట్ బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది.
ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..
మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించినా కూడా ఆ సినిమా కూడా నిరాశపరిచింది. చివరగా నితిన్ తో రాబిన్ హుడ్ సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ అనే సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది. మొన్నామధ్య ఈ సినిమా నుంచి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు అఖిల్ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్లో దారుణంగా..
లెనిన్ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కిరణ్ సబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు సినిమాకు దర్శకత్వం వహించాడు మురళీ.. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలై కొంత పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యిందట. దాంతో ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని నెటిజన్స్, అక్కినేని అభిమానులు ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి శ్రీలీలను తప్పించారు మేకర్స్. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారని తెలుస్తుంది. ఇప్పటికే శ్రీలీల కోసం షూటింగ్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారట మేకర్స్.. అయినా కూడా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నా అని చెప్పడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారని తెలుస్తుంది. ఇప్పటికే మరో హీరోయిన్ కోసం వెతుకులాట కూడా మొదలు పెట్టారని సమాచారం.. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి