
నిద్ర సమస్యలతో బాధపడే వారికి గుమ్మడికాయ గింజలు సాయం చేస్తాయి. వీటిలో ట్రిప్టోఫాన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ మెలటొనిన్ ఉత్పత్తిని పెంచి నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా గింజలు తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
విటమిన్ సి, జింక్, రాగి లాంటి పోషకాలు గుమ్మడికాయ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచుతాయి. వైరస్ లు బ్యాక్టీరియాల నుండి శరీరాన్ని కాపాడతాయి. దీని వల్ల తరచుగా వచ్చే జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గుతాయి.
గుమ్మడికాయ గింజలు మగవారిలో ప్రోస్టేట్ కు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మూత్రానికి సంబంధించిన ఇబ్బందుల నుండి ఉపశమనం ఇస్తాయి. ఈ గింజల నుంచి తీసిన నూనె కూడా ప్రోస్టేట్ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది.
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారుతోంది. గుమ్మడికాయ గింజల్లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఫలితంగా సంతానోత్పత్తి పెరుగుతుంది.
ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. షుగర్ ఉన్నవారు వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటే లాభం పొందవచ్చు.
గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ ఆహారం తినడాన్ని ఆపుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉండే అవకాశం పెరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు చిన్నవైనా.. ఆరోగ్యానికి ఇచ్చే లాభాలు చాలా ఎక్కువ. నిద్రలేమి, రోగనిరోధక సమస్యలు, షుగర్, బరువు అదుపు లాంటి అనేక సమస్యలకు ఇవి సహజ పరిష్కారం. రోజూ కొద్దిగా గింజలు తినడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. వీటిని ఎక్కువ తినకూడదు. తగినంత మోతాదులో మాత్రమే తింటే మంచి ఫలితాలు వస్తాయి. అవసరమైతే ఆహార నిపుణులను సంప్రదించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)