ఆడియన్స్ టెస్ట్ మారిపోయింది. ఒకానొక సమయంలో ఫ్యామిలీ కంటెంట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి.. ఆతర్వాత మాస్ సినిమాల ట్రెండ్ నడించింది.. ఇక ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలు, హారర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. థ్రిల్లర్ సినిమాలకు కూడా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలో విడుదలవుతుంటాయి.. ఎక్కువగా హారర్, థ్రిల్లర్ సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు ఓటీటీల్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ ఓటీటీలను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో సీన్ సీన్ ప్రేక్షకుల నరాలు కట్టేలా ఉంటాయి. ఊహించని ట్విస్ట్ లు, భయంకరమైన సీన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..
ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రోజ్ డా సిల్వా అనే మహిళ తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఈ జంట ఓ యువతిని దత్తత తీసుకుంటారు. అయితే ఆ చిన్నది నిద్రలో నడవడం.. ఓ పేరు పిలుస్తుండటం చేస్తూ ఉంటాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక ఆ తల్లిదండ్రులు భయపడతారు. అసలు అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోవడానికి రోజ్ ఆమెను తీసుకొని నిద్రలో ఆమె కలవరిస్తున్న ప్లేస్ కు వెళ్తుంది. భర్త ఒప్పుకోకపోయినా కూడా రోజ్ ఆమెను తీసుకొని అక్కడికి వెళ్తుంది.
ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్లో దారుణంగా..
అయితే అక్కడ 30ఏళ్ల క్రితం జరిగిన ఓ అగ్ని ప్రమాదం వల్ల నిర్మానుష్యంగా మారిపోతుంది. అయితే అక్కడికి వెళ్లే సమయంలో ఓ చిన్న పాప కారుకు అడ్డు వచ్చినట్టు కనిపించడంతో కారు కంట్రోల్ తప్పి ప్రమాదం జరుగుతుంది. రోజ్ స్పృహ కోల్పోతుంది. కళ్లు తెరిచి చూస్తే తనతో వచ్చిన చిన్నారి మిస్ అవుతుంది. రోజ్ ఆమెను వెతుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు భయంకరమైన సన్నివేశాలు కనిపిస్తాయి. వింత జంతువులు ఎదురవుతాయి. అదే సమయంలో ఆమెకు ఓ మహిళా పోలీస్ సాయం చేస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఆ ఊర్లోని వీధుల్లో చిక్కుకుంటారు. ఆతర్వాత రోజ్ అక్కడ ఓ మహిళను కలుసుకుంటుంది. ఆమె చెప్పిన విషయం విని షాక్ అవుతుంది. ఆ గ్రామంలో ఓ 30ఏళ్ల అలెస్సా అనే యువతిని మంత్రగత్తె అని భావించి బతికుండగానే బలి ఇస్తారు. దాని తర్వాత ఓ పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుంది. ఆమె పెట్టిన శాపం కారణంగానే అలా జరుగుతుంది.. అదే సమయంలో అలెస్సా ఆత్మ రోజ్ తీసుకొచ్చిన అమ్మాయిలో చేరుతుంది. ఆతర్వాత ఎం జరిగింది. అలెస్సా ప్రతీకారం తీర్చుకుందా.? రోజ్ అక్కడి నుంచి బయట పడిందా.? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ఈ సినిమా పేరు సైలెంట్ హిల్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, పీకాక్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడం మంచిది.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి