దిన ఫలాలు (జూన్ 26, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ వృద్ది ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాన్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం బాగా సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి లభించని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా బాగా బిజీగా సాగిపోతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కొద్దిపాటి శ్రమతో వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా పురోగమిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల చదువులు సంతృప్తికరంగానే సాగిపోతాయి. వస్త్రాభరణాలు, విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కరువవుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. గృహ, వాహన రుణాల భారం తగ్గుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినవచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు తదితర వృత్తి నిపుణులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం, ఆదాయ మార్గాలు బాగా వృద్ధి చెందుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య అప్రయత్నంగా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో కీలక బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారం బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మార డానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను మించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు అదనపు లక్ష్యాలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో క్షణం కూడా విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్క బెట్టాల్సి వస్తుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. పని భారం, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో మిత్రులు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.