Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసేదే మీ వ్యక్తిత్వం.. మీరు సృజనాత్మక వ్యక్తా లేదా తార్కిక ఆలోచనాపరుడా తెలుసుకోండి..

26 June 2025

Viral Video: వామ్మో… కాస్తయితే.. డేంజరస్‌ పక్షుల నుంచి బిడ్డ సేఫ్‌… ఆ పక్షికి చిక్కారా అంతే సంగతులు

26 June 2025

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Google Chandrasekhar Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే! – tirumala google vice president thota chandrasekhar donated rs 1 crore to ttd sv pranadana trust
ఆంధ్రప్రదేశ్

Tirumala Google Chandrasekhar Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే! – tirumala google vice president thota chandrasekhar donated rs 1 crore to ttd sv pranadana trust

.By .26 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Google Chandrasekhar Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే! – tirumala google vice president thota chandrasekhar donated rs 1 crore to ttd sv pranadana trust
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Google ChandraSekhar Rs 1 Crore: తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళం అందజేశారు. దీనితో పాటు, టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

హైలైట్:

  • తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం
  • గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్
  • టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఇచ్చారు
టీటీడీకి గూగుల్ చంద్రశేఖర్ రూ.1కోటి విరాళం
టీటీడీకి గూగుల్ చంద్రశేఖర్ రూ.1కోటి విరాళం (ఫోటోలు– Samayam Telugu)
తిరుమల శ్రీవారిని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. స్వామివారికి కానుకల్ని, విరాళాలను అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు భక్తులు నేరుగా స్వామివారి హుండీలో కానుకల్ని సమర్పిస్తే.. మరికొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్ట్‌లకు విరాళాల రూపంలో అందజేస్తుంటారు. తాజాగా మరో భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. దాతను టీటీడీ ఛైర్మన్ అభినందించారు.

నందలూరు, తాళ్లపాక ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు

టీటీడీ అనుబంధనంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరు, తాళ్లపాకలోని ఆలయాలలో జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నందలూరు, తాళ్లపాకలలో పరిశీలించారు. అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుంచి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయన్నారు. ఈ సందర్భగా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీన, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05న అంకురార్పణ జరుగనుందన్నారు.

నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో, శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి.

తిరుమల శ్రీవారికి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

నందలూరు, తాళ్లపాక ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ జేఈవో వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహన సేవలలో సమయ పాలన పాటించాలని కోరారు. ఆలయ పరిసరాలలో ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నందలూరు, తాళ్లపాకలలో ఆకట్టుకునేలా విద్యుత్ , పుష్ప అలంకరణలు చేపట్టాలన్నారు. ఈ మూడు ఆలయాల్లో కళ్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Amaravati Tenders Finalization,అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు.. టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వం – tenders finalized for construction of integrated state secretariat and hod towers in amaravati

26 June 2025

Gaming Apps: శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో ఆటలు.. ఆన్‌లైన్‌లో పుట్టుకొస్తున్న గేమింగ్ యాప్స్!

26 June 2025

Pawan Kalyan: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఏంటో చూపిస్తున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

26 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసేదే మీ వ్యక్తిత్వం.. మీరు సృజనాత్మక వ్యక్తా లేదా తార్కిక ఆలోచనాపరుడా తెలుసుకోండి..

26 June 2025

మన ప్రవర్తన ద్వారా ప్రజలు కొలుస్తారు . మనం ధరించే దుస్తుల నుండి, మనం మాట్లాడే విధానం నుండి, ఇతరులతో…

Viral Video: వామ్మో… కాస్తయితే.. డేంజరస్‌ పక్షుల నుంచి బిడ్డ సేఫ్‌… ఆ పక్షికి చిక్కారా అంతే సంగతులు

26 June 2025

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025

గ్లాస్‌లో పసుపు వేసే రీల్ ట్రెండ్.. ఇది దెయ్యాలను ఆహ్వానించడమేనా?

26 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Personality Test: ఈ చిత్రంలో మొదట చూసేదే మీ వ్యక్తిత్వం.. మీరు సృజనాత్మక వ్యక్తా లేదా తార్కిక ఆలోచనాపరుడా తెలుసుకోండి..

26 June 2025

Viral Video: వామ్మో… కాస్తయితే.. డేంజరస్‌ పక్షుల నుంచి బిడ్డ సేఫ్‌… ఆ పక్షికి చిక్కారా అంతే సంగతులు

26 June 2025

ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తుండగా ఊహించని ఘటన.. దెబ్బకు థియేటర్ నుంచి పరుగులు పెట్టిన జనం..

26 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.