Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool

26 June 2025

పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందా..? ఆ 123దేశాల్లో అడుగుపెడితే అరెస్ట్ తప్పదా..?

26 June 2025

అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..

26 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Strong Warning To Ganja Cultivation,ఎక్కడ గంజాయి పెంచినా.. శాటిలైట్‌తో చూస్తాం.. వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ – chandrababu strong warning to those who grow ganja cultivation on anti narcotics day 2025
ఆంధ్రప్రదేశ్

Chandrababu Strong Warning To Ganja Cultivation,ఎక్కడ గంజాయి పెంచినా.. శాటిలైట్‌తో చూస్తాం.. వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ – chandrababu strong warning to those who grow ganja cultivation on anti narcotics day 2025

.By .26 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Strong Warning To Ganja Cultivation,ఎక్కడ గంజాయి పెంచినా.. శాటిలైట్‌తో చూస్తాం.. వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ – chandrababu strong warning to those who grow ganja cultivation on anti narcotics day 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గంజాయి, డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గంజాయి సాగును అరికట్టేందుకు శాటిలైట్, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని, ముఠా గొడవలకు తావులేకుండా రాయలసీమలో ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. గంజాయి పెంచేవారని వదిలిపెట్టబోనని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

గంజాయి పెంచేవాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
గంజాయి పెంచేవాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ (ఫోటోలు– Samayam Telugu)
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా అడ్డు వస్తే వారిని తొక్కుకుంటూ పోతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. గత ప్రభుత్వం గంజాయిని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకు తమ పార్టీ కార్యాలయంపై గతంలో దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్స్‌ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ఆ తర్వాత శ్రీకన్వెన్షన్‌లో విద్యార్థులు, యువతతో జరిగిన సదస్సులో కీలక ప్రసంగం చేశారు.

సాటిలైట్, డ్రోన్లతో నిఘా

“ఇప్పుడే హామీ ఇస్తున్నాం, ఈరోజు కూడా హెచ్చరిస్తున్నాం. ఒక సంవత్సరం అందరికీ చెప్పా. ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పా. ఎక్కడా గంజాయి పెంచడానికి వీలులేదు. సాటిలైట్, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం. డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా,” అని చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

రాయలసీమ ముఠాలపై ఉక్కుపాదం

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ముఠా గొడవలకు తావు ఉండదని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన చరిత్ర టీడీపీకి ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడతామని, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. గంజాయి ముఠాలకు సహకరించిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

సమష్టి బాధ్యత.. ప్రతిపక్షాల సహకారం

గంజాయిని నిర్మూలించడం కేవలం ప్రభుత్వానిదే కాదు, అందరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ఈ పోరాటంలో ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు. ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలని, తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదని ఆయన అన్నారు. 2021లో దేశంలో మొత్తం గంజాయి సాగులో 50 శాతం ఏపీ, ఒడిశా నుంచే వచ్చిందని, విశాఖ కేంద్రంగా ఈ కార్యకలాపాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త కార్యక్రమాలు, సంస్కరణలు

గంజాయికి బానిసలై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని, అసాంఘిక పనులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ షాపుల్లో కూడా మత్తు పదార్థాలు అమ్ముతున్నారని తెలిపారు. దీనిపై నిఘా కోసం ‘ఈగల్‌’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. “ఇప్పటికైనా మారకపోతే రాష్ట్రంలో ఉండేందుకు అర్హత లేదు,” అని ఆయన హెచ్చరించారు.

  • రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్‌ ఏర్పాటు.
  • పాఠశాలల్లో ‘ఈగల్‌ క్లబ్‌’ల ఏర్పాటు.
  • ఏదైనా సమస్య వస్తే 1972కు మెసేజ్ పంపితే రక్షణ కల్పించే హామీ.
  • మద్యం ఆదాయంలో 2 శాతం డ్రగ్స్‌ నిర్మూలనకు ఖర్చు.
  • రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 56 డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు.
  • ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిక.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారానికి సినీ నటులు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయం, ఏపీ, తెలంగాణ, స్పోర్ట్స్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool

26 June 2025

Cm Chandrababu Naidu Tweet On Two Policemen Died,రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మృతి.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ – cm chandrababu naidu tweet on two policemen died alamuru si and constable died in road accident

26 June 2025

CM Chandrababu: డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

26 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool

26 June 2025

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం.. తాజాగా భూమిని కేటాయించింది. రిలయన్స్ కంపెనీ రూ.1622 కోట్ల పెట్టుబడి…

పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందా..? ఆ 123దేశాల్లో అడుగుపెడితే అరెస్ట్ తప్పదా..?

26 June 2025

అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..

26 June 2025

Tollywood: ఈ అందాల తారది ఎంత గొప్ప మనసో.. 100 మంది పేద విద్యార్థినులకు సైకిళ్లను కొనిచ్చిన బుల్లితెర నటి

26 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ap Govt Land Allocates To Reliance,ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్ల పెట్టుబడి, ఆ ప్రాంతానికి మహర్దశ – andhra pradesh govt land allocated to reliance industries limited orvakal near kurnool

26 June 2025

పుతిన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందా..? ఆ 123దేశాల్లో అడుగుపెడితే అరెస్ట్ తప్పదా..?

26 June 2025

అమెరికా వీసాల కోసం చూసే భారతీయులకు అలర్ట్.. US ఎంబసీ కొత్త రూల్..

26 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.