వర్షాకాలం మొదలైంది. దీంతో శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఉదయం జలుబు, గొంతు నొప్పి బాధపెడుతుంది. అలాంటి పరిస్థితిలో ఇంట్లో ఉండే రెండు ఔషధ పదార్థాలు – ఎండిన అల్లం (సొంటి), తులసి మీకు ఉపశమనం కలిగిస్తాయి. వీటితో తయారుచేసిన టీ రుచికరమైనది మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక అద్భుతమైన గృహ నివారణ కూడా.
తులసి టీ ప్రయోజనాలు:
- మారుతున్న వాతావరణంలో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- జలుబు, దగ్గు , గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది
- జీర్ణక్రియను బలపరుస్తుంది . శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది
- సొంటి శరీరానికి వెచ్చదనాన్ని తెస్తుంది. అలసటను తొలగిస్తుంది.
- తులసి వైరస్లు , బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది
ఇవి కూడా చదవండి
తయారీకి కావాల్పసిన పదార్థాలు
- నీరు- 1 కప్పు
- తులసి ఆకులు- 4-5
- అల్లం పొడి (సొంటి) – 1/2 టీస్పూన్ పొడి
- తేనె (ఐచ్ఛికం)- 1 టీస్పూన్
- టీ ఆకులు- 1/2 టీస్పూన్ సాదా
తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు నీరు అందులో వేయండి. ఇపుడు ఆ నీటిలో తులసి ఆకులు, సొంటి పొడిని వేయండి. టీ రుచిని కోరుకుంటే.. అందులో కొన్ని టీ ఆకులను జోడించండి.
తక్కువ మంట మీద 5-7 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు గ్యాస్ ఆపివేసి టీని ఫిల్టర్ చేయండి. టీ కొద్దిగా గోరువెచ్చగా మారినప్పుడు.. అందులో తేనె జోడించండి.
ఎప్పుడు, ఎలా తాగాలంటే
- ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం మీకు చలిగా అనిపించినప్పుడు తీసుకోండి.
- రోజుకు ఒకటి లేదా రెండుసార్లు దీన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
- దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
- అయితే మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే లేదా గర్భవతిగా ఉంటే ఈ టీ తాగే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)