Tirumala TTD Alert On Ghat Road Repair Works: తిరుమల ఘాట్ రోడ్లకు మహర్దశ రానుంది. తరచూ వర్షాల కారణంగా రోడ్లు పాడవడంతో టీటీడీ మరమ్మతులు చేపట్టింది. రెండు ఘాట్ రోడ్ల మరమ్మతుల కోసం రూ.10.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పనులు జరుగుతున్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున గంట ముందుగా ప్రయాణం మొదలు పెట్టాలని టీటీడీ సూచించింది. అత్యవసర పరిస్థితిలో టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. రెండున్నర నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
హైలైట్:
- తిరుమల వచ్చే భక్తులకు ముఖ్య గమనిక
- ఒక గంటే బయల్దేరి రావాలన్న టీటీడీ
- ఘాట్ రోడ్లలో పనుల కారణంగా నిర్ణయం

ఇదిలా ఉంటే.. తిరుమల ఘాట్ రోడ్లోలో పనులు జరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది. వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలు నడపాలని.. తిరుమలకు వచ్చే భక్తులు కనీసం గంట ముందుగా ప్రయాణం మొదలు పెట్టాలని సూచిస్తోంది టీటీడీ. ఘాట్ రోడ్ల పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 155257కు ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఒక గంట ముందే వచ్చేయండి.. టీటీడీ కీలక సూచన
తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో బీటీ రోడ్డు రెండున్నర నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామంటున్నారు టీటీడీ అధికారులు. ఈ రోడ్ల పనుల కోసం టీటీడీ అత్యాధునిక యంత్రాలనుతీసుకొచ్చి పనులు చేయిస్తోంది. అలాగే తిరుమలకు వచ్చివెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకవైపు రోడ్డును తవ్వుతూనే మరోవైపు వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి వస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.