
రెబల్ స్టార్ ప్రభాస్ స్పీడ్ ఇప్పట్లో ఆగేలా లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే పనిలో ఉన్నాడు సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మణిరత్నం స్టైల్ లో సినిమా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించాడు.
ఇక కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయ రికార్డ్ క్రియేట్ చేసింది. కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె కీలకపాత్రల్లో కనిపించారు. ఇక కల్కి 2 సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు తాజాగా కల్కి సినిమా విడుదలై ఏడాది పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తికావడంతో కల్కి 2 సినిమాపై అప్డేట్ ఇచ్చారు.
కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. కల్కి 2 సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలవుతుంది.. వచ్చే సంవత్సరం మే లేదా జూన్ లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసేలా సినిమా ఉంటుంది అని అశ్వినీదత్ అన్నారు. ఇక ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించిన కన్నప్ప ఈ రోజు విడుదలైంది సినిమాలో ప్రభాస్ సీన్స్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి