Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kannappa: హిట్టా..? ఫట్టా..? కన్నప్ప ఫుల్ రివ్యూ

27 June 2025

నీట్‌ మాక్‌ టెస్ట్‌లో మార్కులు తక్కువొచ్చాయని కూతురిని చితకబాదిన తండ్రి.. కట్‌చేస్తే

27 June 2025

400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

27 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Baba Ramdev As AP Tourism Brand Ambassador,ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బాబా రాందేవ్.! – chandrababu naidu proposes baba ramdev as ap tourism brand ambassador
ఆంధ్రప్రదేశ్

Baba Ramdev As AP Tourism Brand Ambassador,ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బాబా రాందేవ్.! – chandrababu naidu proposes baba ramdev as ap tourism brand ambassador

.By .27 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Baba Ramdev As AP Tourism Brand Ambassador,ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బాబా రాందేవ్.! – chandrababu naidu proposes baba ramdev as ap tourism brand ambassador
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. హోమ్‌స్టేలు, మెరుగైన రవాణా సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించాలని చూస్తోంది. తాజాగా, యోగా గురువు రామ్‌దేవ్ బాబాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి రాందేవ్ బాబా కూడా సానుకూలంగా స్పందించారు. బాబా రాందేవ్ సహకారంతో రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది!

ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బాబా రాందేవ్.!
ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బాబా రాందేవ్.!

రాష్ట్రంలోపర్యాటక రంగం అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సర్క్యూట్ ఎకానమీ ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. అలాగేహోమ్‌స్టేలు వంటి వినూత్న విధానాల ద్వారాటూరిజం అభివృద్ధి చేసే పనిలో ఉంది. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి సందర్శకులకు ఆకర్షించాలనే ఉద్దేశంతో.. ఎయిర్‌డ్రోమ్‌లు ఏర్పాటుచేసే ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వం చేస్తోంది. తాజాగా ఏపీ టూరిజం కోసం బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌దేవ్ బాబా పేరు తెరపైకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.విజయవాడలో శుక్రవారం టూరిజం కాంక్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. బాబా రామ్‌దేవ్ ‌ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలంటూ బాబా రామ్‌దేవ్‌ను చంద్రబాబు కోరారు. అలాగే ఏపీలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు బాబా రాందేవ్‌ను కోరారు. సీఎం చంద్రబాబు కోరిక నేపథ్యంలో ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి బాబా రామ్‌దేవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నో సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని.. అయితే ఉత్తర భారతీయులకు వీటిపై అవగాహన లేదన్నారు.

ఏపీలోని పర్యాటక ప్రాంతాల గురించి ఉత్తర భారతదేశంలోని వారికి తెలియజేయాలని.. అలాగే పర్యాటక ప్రాంతాలలో ఆయుర్వేద, నేచురోపతి, యోగా వంటి అంశాలు అవసరమని అన్నారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలోని హార్సిలీహిల్స్‌లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వెల్‌నెస్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు రాందేవ్ బాబా తెలిపారు.

సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో హార్సిలీ‌హిల్స్‌లో వెల్‌నెస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విజయనగరం జిల్లా కొత్తవలసలో మెసర్స్‌ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పేరుతో రూ.500 కోట్లతో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ భూములను గురువారం ఆయన పరిశీలించిన సంగతి తెలిసిందే.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి