మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మహాభారత సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, యోగిబాబు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో విష్ణు కూతుర్లు, కొడుకు అవ్రమ్ సైతం వెండితెరకు పరిచయమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ.. మోహన్ బాబు యాక్టింగ్.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే క్లైమాక్స్ చివర్లో 20 నిమిషాలు విష్ణు నటన గూస్ బంప్స్ అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు సైతం కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రానికి ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే ఈ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదని.. తాను అడగ్గానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నాడంటూ గతంలో విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మాత్రమే కాదు.. పలువురు స్టార్స్ సైతం ఈ సినిమాలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదట. ఇంతకీ వారెవరో తెలుసుకుందామా.
ప్రభాస్ కాకుండా ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా నటించిన మరో యాక్టర్ మోహన్ లాల్. ఈ చిత్రానికి ఒక్క రోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారట. అందుకు రెమ్యునరేషన్ తీసుకోలేదట. అలాగే ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుంది. ఇందులో రుద్ర పాత్రలో డార్లింగ్ కనిపించిన తీరు.. మంచు విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. కన్నప్ప సినిమా కోసం తన టైమ్ కేటాయించారని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించారు అక్షయ్ కుమార్.. రూ.6 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అలాగే కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ అతిథి పాత్రలలో కనిపించినందుకు ఒక్కొక్కరు కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది.
ఇవి కూడా చదవండి :
Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..
చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..
Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్.. ఇప్పుడేం చేస్తుందంటే..
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..