ఈ రెసిపీ చాలా తేలికైనది. ఇంట్లో ఉన్న బ్రెడ్, కొన్ని కూరగాయలు, కొద్దిగా మసాలా, మాయో కలిపితే చాలు. ఓవెన్, బ్రెడ్ టోస్టర్ లేకుండానే దీన్ని చేయవచ్చు. రుచిలో క్రీమీగా ఉండే ఈ సాండ్విచ్ కి, మామూలు టోస్ట్ చేయకుండా కూడా వండవచ్చు. మీరు కాల్చిన బ్రెడ్ ఇష్టపడకపోతే, నేరుగా ఫిల్లింగ్ వేసి వడ్డించవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే టేస్ట్ తో ఉంటుంది.
సాండ్విచ్ కోసం కావాల్సిన పదార్థాలు
- బ్రెడ్ ముక్కలు – 4
- వెన్న – అవసరమైనంత
ఫిల్లింగ్ కోసం కావాల్సిన పదార్థాలు
- తరిగిన ఉల్లిపాయ లేదా గ్రీన్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్లు
- చిన్న పచ్చి మిరపకాయ – 1 (విత్తనాలు తీసి, సన్నగా తరిగినది)
- వెల్లుల్లి పొడి – 1/4 టీస్పూన్ లేదా చిన్న వెల్లుల్లి రెబ్బ తురిమింది 1
- రెడ్ బెల్ పెప్పర్ లేదా టమాటా (గట్టిగా ఉండాలి) – 1/4 కప్పు (తరిగినవి)
- తరిగిన లెట్ట్యూస్ లేదా క్యాబేజీ – 1/4 కప్పు
- క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు (కావాలంటే)
- ఉడికించిన స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్లు (కావాలంటే)
- మిరియాల పొడి – 1/2 టీస్పూన్
- రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – 1/4 టీస్పూన్
- మాయోన్నైస్ – 3 టేబుల్ స్పూన్లు
- డ్రై మస్టర్డ్ పౌడర్ – 1/4 టీస్పూన్ (లేదా డిజాన్ మస్టర్డ్ – 1 టీస్పూన్)
తయారీ విధానం
ముందుగా నాలుగు బ్రెడ్ ముక్కలపై వెన్న రాసి పెనంపై బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. ఒకవేళ పాన్ పై కాల్చడం ఇష్టం లేకపోతే.. నేరుగా ఫిల్లింగ్ తో కప్పి సాండ్విచ్ మేకర్ లో కూడా కాల్చవచ్చు. ఆ తర్వాత, ఒక గిన్నెలో ఉల్లిపాయ (లేదా గ్రీన్ ఆనియన్స్), పచ్చి మిరపకాయ (కావాలంటే), వెల్లుల్లి పొడి (లేదా తురిమిన వెల్లుల్లి) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి రెడ్ బెల్ పెప్పర్ (లేదా టమాటా), తరిగిన లెట్ట్యూస్ (లేదా క్యాబేజీ), క్యారెట్ తురుము (కావాలంటే), ఉడికించిన స్వీట్ కార్న్ (కావాలంటే) వంటి కూరగాయలను చేర్చి కలపాలి.
చివరగా మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మాయోన్నైస్, డ్రై మస్టర్డ్ పౌడర్ (లేదా డిజాన్ మస్టర్డ్) వేసి ఫిల్లింగ్ ను బాగా కలిపి సిద్ధం చేసుకోవాలి. రుచి చూసి అవసరమైతే మరిన్ని మసాలాలు, మాయో చేర్చవచ్చు, కావాలనుకుంటే చిల్లీ సాస్ లేదా షెజ్వాన్ సాస్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కపై సిద్ధం చేసుకున్న ఫిల్లింగ్ ను వేసి సమంగా ఫిల్ చేయాలి. ఇంకో బ్రెడ్ ముక్కతో మూసి మధ్యలో కట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయండి.
ఈ రెసిపీకి సంబంధించి చిట్కాలు
- మంచి మాయో ఎంపికే రుచికి కీలకం. వెజిటేరియన్ అయితే ఎగ్ లెస్ మాయో వాడండి. వీగన్ అయితే నట్ బేస్డ్ మాయో వాడవచ్చు.
- మాయో లేకపోతే.. ఇంట్లో పెరుగు తీసుకొని మస్లిన్ క్లాత్ లో వడకట్టి హంగ్ కర్డ్ గా వాడవచ్చు. లేదా గ్రీక్ యోగర్ట్ కానీ క్రీమ్ చీజ్ కానీ వాడవచ్చు.
- సాధారణంగా వైట్ బ్రెడ్ వాడతారు కానీ మల్టిగ్రెయిన్, హోల్ వీట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచివి. అవసరమైతే సవర్ డో లేదా ఆర్టిసన్ బ్రెడ్ వాడవచ్చు.
- తక్కువ టైమ్ లో కావాలంటే.. ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర వంటివి మాత్రమే వాడండి. ఇది 5 నుంచి 7 నిమిషాల్లో రెడీ అవుతుంది.
- బీట్ రూట్, బంగాళదుంపలు, బ్రొకోలీ, క్యాప్సికమ్ వంటి కూరగాయలు కూడా బాగుంటాయి. అయితే వీటిని ముందే ఉడికించాలి.
- సాస్ లు మసాలాలు.. మిరియాల పొడి, మస్టర్డ్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వంటివి వేస్తే బాగా రుచిగా ఉంటుంది.