Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kannappa: ‘కన్నప్ప’ సినిమాను మిస్ చేసుకున్నఆ స్టార్ హీరోయిన్ చెల్లి.. షూట్ ప్రారంభమయ్యాక గుడ్ బై.. ఎందుకంటే?

29 June 2025

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్

29 June 2025

MG Cars: ఎంజీ కార్ల లవర్స్‌కు షాక్.. జూలై 1 నుంచి ధరల పెంపు

29 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Us Eb 1 Green Card,విశాఖ వాసికి అమెరికా అరుదైన గుర్తింపు.. ఈబీ-1 గ్రీన్ కార్డ్ జారీ.. ప్రత్యేకత ఏంటి? – indian man venkat charan from visakhapatnam gets usa eb i green card
ఆంధ్రప్రదేశ్

Us Eb 1 Green Card,విశాఖ వాసికి అమెరికా అరుదైన గుర్తింపు.. ఈబీ-1 గ్రీన్ కార్డ్ జారీ.. ప్రత్యేకత ఏంటి? – indian man venkat charan from visakhapatnam gets usa eb i green card

.By .29 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Us Eb 1 Green Card,విశాఖ వాసికి అమెరికా అరుదైన గుర్తింపు.. ఈబీ-1 గ్రీన్ కార్డ్ జారీ.. ప్రత్యేకత ఏంటి? – indian man venkat charan from visakhapatnam gets usa eb i green card
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నంకు చెందిన వెంకట చరణ్ ఫ్రిక్షన్ వెల్డింగ్‌పై చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆయన ప్రతిభకు అమెరికా ఫిదా అయి ఈబీ-1 గ్రీన్ కార్డును జారీ చేసింది. గీతం కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన చరణ్, ‘అచీవర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్’ ద్వారా విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీగా పనిచేస్తున్నారు. ఆయన పరిశోధనలను 25 దేశాలు గుర్తించాయి.

హైలైట్:

  • అంతర్జాతీయంగా విశాఖ యువకుడికి గుర్తింపు
  • ప్రిక్షన్ వెల్డింగ్‌లో పరిశోధనలకు దక్కిన గౌరవం
  • ప్రతిభావంతులకు ఇచ్చే గ్రీన్ కార్డు జారీచేసిన అమెరికా
అమెరికా గ్రీన్ కార్డు
అమెరికా గ్రీన్ కార్డు (ఫోటోలు– Samayam Telugu)

విశాఖవాసి పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఆయన ప్రతిభకు అగ్రరాజ్యం అమెరికా సైతం ఫిదా అయ్యింది. అందుకే ప్రత్యేక రంగంలో అత్యున్నత ప్రతిభావంతులైన వ్యక్తులకు అందజేసే ఈబీ-1 గ్రీన్ కార్డును అమెరికా జారీచేసింది. విశాఖపట్నానికి చెందిన వెంకట చరణ్ ఫ్రిక్షన్ వెల్డింగ్‌పై చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సహాయం చేయడానికి ‘అచీవర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్’ అనే సంస్థను ఆయన స్థాపించారు. గీతం కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వెంకట చరణ్.. ప్రస్తుతం అమెరికాలోని ఒక ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీగా పనిచేస్తున్నారు.విమానాలు తయారు చేయాలన్నా, భారీ వంతెనలు నిర్మించాలన్నా, గ్యాస్ పైపులైన్లు వేయాలన్నా వెల్డింగ్ చాలా ముఖ్యం. వెల్డింగ్ ఎక్కువైనా, తక్కువైనా నాణ్యత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎంత సమయం వెల్డింగ్ చేస్తే అది గట్టిగా ఉంటుందనేది చాలా ముఖ్యం. వెంకట చరణ్ ఫ్రిక్షన్ వెల్డింగ్‌పై పరిశోధన చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పరిశోధనను 25 దేశాలు గుర్తించాయి. అమెరికా ప్రభుత్వం ఆయన చేసిన కృషిని మెచ్చుకుంది. అందుకే ఆయనకు ఈబీ-1 గ్రీన్ కార్డు ఇచ్చింది. ఏదైనా రంగంలో బాగా రాణించిన వారికి ఈ కార్డు ఇస్తారు. వెంకట చరణ్ గీతంలో బీఈ పూర్తి చేశారు. ఇప్పుడు అమెరికాలోని ఒక పెద్ద ఎలక్ట్రిక్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీగా పనిచేస్తున్నారు.

చాలామంది చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటారు. కానీ ఎలా వెళ్లాలో, ఎక్కడ చదవాలో, ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు. అలాంటి వారికి సహాయం చేయడానికి వెంకట చరణ్ ‘అచీవర్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్’ అనే సంస్థను స్థాపించారు. ఆయన తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదని సలహాలు ఇస్తూ, కొత్తవారికి దారి చూపిస్తున్నారు.

ఏంటీ ఈబీ-1 గ్రీన్ కార్డు

ఈబీ-1 గ్రీన్ కార్డును అందరికీ ఇవ్వరు. ఆస్కార్ అవార్డులు, ఒలింపిక్స్ పతకాలు, నోబెల్ బహుమతులు గెలుచుకున్న వాళ్లకి ఇస్తారు. అలాగే, ఏదైనా రంగంలో చాలా గొప్పగా పనిచేసిన వాళ్లకి కూడా ఇస్తారు. వెంకట చరణ్ ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది పోటీ పడ్డారు. చాలా పరీక్షల తర్వాత ఆయనను ఎంపిక చేశారు. ఆయనకు అంతర్జాతీయంగా ఉన్న పేరును, ఆయన రాసిన పరిశోధన పత్రాలను చూసి ఈ కార్డు ఇచ్చారు. ఆయన రాసిన కొన్ని విషయాలను 25 దేశాల పరిశోధకులు 400 సార్లు ఉపయోగించారు. ఆయన ఫ్రిక్షన్ వెల్డింగ్‌పై చేసిన పరిశోధన కొత్తగా ఉండటంతో ఆయనకు కలిసొచ్చింది.

విశాఖ వాసికి అమెరికా అరుదైన గుర్తింపు.. ఈబీ-1 గ్రీన్ కార్డ్ జారీ.. ప్రత్యేకత ఏంటి?

పరిశోధనలు అమోఘం

వెంకట చరణ్ తయారీ రంగంలో నాణ్యతను కాపాడే నిపుణుడిగా ఎదిగారు. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఒక్కో మెట్టు ఎక్కారు. వస్తువుల నాణ్యతను గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. ఆయన పరిశోధనలు 20కి పైగా అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. కొంతమంది రచయితలతో కలిసి ఐదు పుస్తకాల్లో కొన్ని పాఠాలు రాశారు. కొన్ని అంతర్జాతీయ ప్రచురణలకు సమీక్షకుడిగా కూడా పని చేస్తున్నారు. వెంకట్ చరన్ చాలా సంవత్సరాలుగా అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ (ASQ) సభ్యుడిగా ఉన్నారు. చాలా సంస్థల్లో గౌరవ పదవులు నిర్వహించారు. 85 దేశాలకు చెందిన ఇంజినీర్లున్న మెంబర్ ఆఫ్ సొసైటీ ఫర్ మానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితం ఆ సంస్థ నుంచి ఉత్తమ యువ ఇంజినీర్ అవార్డును కూడా గెలుచుకోవడం విశేషం.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి