AP Property Tax Can Pay In Whatsapp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపులను సులభతరం చేస్తూ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాట్సాప్ మనమిత్ర ద్వారా ఎక్కడి నుంచైనా ఆస్తి పన్ను చెల్లించవచ్చు. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా రాష్ట్రంలోని చాలా మందికి వారి ఆస్తుల పన్నులు చెల్లించడం సులభం అవుతుంది. అంతేకాదు, పంచాయతీల్లో అవినీతిని కూడా అరికట్టవచ్చు అంటున్నారు. ఈ కొత్త విధానం అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానుంది.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- వాట్సాప్‌లో పన్నులు చెల్లించొచ్చు
- పన్నుల చెల్లింపు మరింత సులువు

ఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, వాట్సాప్‌తో చాలా ఈజీగా
ప్రతి ఏటా పంచాయతీల ద్వారా రూ.822.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది.. గతంలో కొన్ని సందర్భాల్లో కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయడం లేదు. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు గతేడాది ప్రభుత్వం ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించవచ్చు అంటున్నారు. ఈ విధానంతో 2024-25లో ఆస్తి పన్ను వసూళ్లు పెరిగాయంటున్నారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా పన్నుల చెల్లింపు మరింత సులువుగా ఉంటుందని చెబుతున్నారు.