Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral: చనిపోయిన మగపాము పక్కనే ఒక రోజంతా ఉన్న ఆడపాము – ఆ తర్వాత

30 June 2025

చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్‌తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత

30 June 2025

AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. ఖరారు చేసిన అధిష్ఠానం!

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Fitness Trainer Joseph,ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరీ జోసఫ్! – andhra pradesh cm chandrababu naidu attended to his fitness trainer joseph new house warming ceremony
ఆంధ్రప్రదేశ్

Chandrababu Fitness Trainer Joseph,ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరీ జోసఫ్! – andhra pradesh cm chandrababu naidu attended to his fitness trainer joseph new house warming ceremony

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Fitness Trainer Joseph,ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరీ జోసఫ్! – andhra pradesh cm chandrababu naidu attended to his fitness trainer joseph new house warming ceremony
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chandrababu Attend Fitness Trainer Joseph Housewarming: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫిట్‌నెస్ ట్రైనర్ జోసఫ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద పార్టీ సమావేశం అనంతరం, తాడేపల్లిలోని జోసఫ్ ఇంటికి వెళ్లారు. జోసఫ్‌ను, అతని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులు చంద్రబాబుతో కరచాలనం చేసి, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి తన బిజీ షెడ్యూల్ లో కూడా ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లడం విశేషం.

హైలైట్:

  • ఫిట్‌నెస్ ట్రైనర్ నూతన గృహ ప్రవేశం
  • హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • చంద్రబాబు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా జోసఫ్
చంద్రబాబు ఫిట్‌నెస్ ట్రైనర్ గృహ ప్రవేశం
చంద్రబాబు ఫిట్‌నెస్ ట్రైనర్ గృహ ప్రవేశం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫిట్‌నెస్ ట్రైనర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు దగ్గర ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత సీఎం నేరుగా తాడేపల్లి ఆశ్రమం రోడ్డుకు వెళ్లారు.. అక్కడ అమరావతి ఐకాన్‌ అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ మూడో ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో తన ఫిట్‌నెస్ ట్రైనర్ జోసఫ్‌ గృహ ప్రవేశ వేడుకకు హాజరయ్యారు. జోసఫ్ కుటుంబ సభ్యులను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జోసఫ్ నివాసానికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నారు. దాదాపు పది నిమిషాల సేపు అక్కడే ఉన్నారు.. జోసఫ్ కుటుంబసభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. సాయంత్రం 6.40 గంటలకు తిరిగి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడంతో ఆ అపార్ట్‌మెంట్ దగ్గర సందడి వాతావరణ కనిపించింది. చంద్రబాబుతో కరచాలనం, సేల్ఫీల కోసం స్థానికులు పోటీపడ్డారు. జోసఫ్ చాలా కాలంగా చంద్రబాబుకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. చంద్రబాబు ప్రతి రోజూ వ్యాయామం చేసేందుకు జోసఫ్ అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నారు.. ఏపీ సీఎం రోజూ యోగాతో పాటుగా కొద్దిసేపు వ్యాయామం చేయడం అలవాటు. చంద్రబాబు ఓవైపు ముఖ్యమంత్రిగా పాలనాపరమైన అంశాలు.. మరోవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. అయినా సరే గుర్తు పెట్టుకుని మరీ తన ఫిట్‌నెస్ ట్రైనర్ జోసఫ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.

ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరీ జోసఫ్!

చంద్రబాబు ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. ఆహారంతో పాటుగా వ్యాయామం, యోగా వంటివి చేస్తారు. అంతేకాదు చంద్రబాబు చేతికి ఒక రింగ్ ఉంటుంది.. ఆ రింగ్ ద్వారా ఆయన హెల్త్ రికార్డ్ మొత్తం నమోదవుతుంది. హార్ట్ బీట్, బీపీ వంటివాటిని మానిటర్ చేస్తుందని గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నాలుగైదేళ్లుగా ఈ రింగ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల కొద్దిరోజులుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే తన చేతి వేలికి రింగ్ పెట్టుకుంటున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి