జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నవ గ్రహాలు మనుషులపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తాయని నమ్ముతారు. ఎవరైనా జాతక ప్రభావం వలన ఏదైనా గ్రహం వలన దుష్ప్రభావాలను పొందుతుంటే.. ఆ గ్రహ దోషం నుంచి ఉపశమనం పొందడానికి దీపాలకు సంబంధించిన కొన్ని నివారణలను చేయవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు మనం ఏ గ్రహానికి ఎటువంటి దీపం వెలిగించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాం..
సూర్యునికి దీపం
సూర్య గ్రహానికి రాగి లేదా మట్టితో చేసిన దానిలో దీపాన్ని ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి ఆదివారం సూర్యోదయం సమయంలో మీరు దేశీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని తూర్పు వైపు పెట్టాలి.
కుజుడికి దీపం
కుజుడికి మట్టి లేదా రాగి దీపాలను కూడా వెలిగించవచ్చు. దీని కోసం మంగళవారం దక్షిణం వైపు ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా ఎవరికైనా కుజ గ్రహానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఉపశమనం పొందవచ్చు.
బుధుని కోసం దీపం
బుధ గ్రహానికి కాంస్య లేదా ఇత్తడి దీపంలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించడానికి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది.
బృహస్పతికి దీపం
గురు లేదా బృహస్పతి గ్రహ దోషం తొలగి శుభ ఫలితాలను పొందడానికి ఆవు నెయ్యి వేసి ఇత్తడి దీపం వెలిగించాలి. దీనితో పాటు ఈశాన్య దిశ ఈ దీపాన్ని వెలిగించడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
శుక్రుడి కోసం
శుక్రుడి అనుగ్రహం కోసం వెండి లేదా మట్టితో చేసిన దీపాన్ని వెలిగించవచ్చు. దీని కోసం నెయ్యి లేదా తెల్ల నువ్వుల నూనెను ఉపయోగించండి. ఈ దీపాన్ని వెలిగించడానికి తూర్పు దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది.
చంద్రునికి దీపం
చంద్ర దోష నివారణ కోసం సోమవారం రాత్రి లేదా చంద్రోదయ సమయంలో దీపం వెలిగించవచ్చు. దీపంలో కర్పూరం లేదా నెయ్యి వేసి పశ్చిమ దిశగా ఉంచండి. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. భావోద్వేగ సమతుల్యతను అనుభవిస్తాడు.
శనిశ్వరుడికి దీపం
శని దేవుని ఆశీర్వాదం పొందడానికి శనివారం నల్ల మట్టి లేదా ఇనుముతో చేసిన దీపంలో దీపాన్ని వెలిగించవచ్చు. ఆవ నూనె, లేదా నల్ల నువ్వుల నూనె దీనికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దీపాన్ని రావి చెట్టు కింద లేదా ఇంటి నైరుతి మూలలో ఉంచండి.
రాహువుకి దీపం
రాహు గ్రహం కోసం శనివారం లేదా బుధవారం ఆవనూనె వేసి మట్టి లేదా ఇనుప దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ఇంటి నైరుతి మూలలో లేదా తులసి దగ్గర ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
కేతువుకి దీపం
కేతువు కోసం మంగళవారం లేదా శనివారం ఆవనూనె దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఈ దీపాన్ని ఇంటికి దక్షిణ దిశలో వెలిగించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.