Visakhapatnam Grandfather Child Adopt: విశాఖపట్నంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో, ఆమెకు పుట్టిన మనవడిని ఆమెకు తెలియకుండానే వేరే వాళ్లకు దత్తత ఇచ్చేశాడు. అసలు విషయం తెలుసుకున్న కూతురు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే స్పందించి బిడ్డను రక్షించి శిశుగృహకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు ఈ తండ్రి ఇలా ఎందుకు చేశాడు?
హైలైట్:
- విశాఖపట్నంలో ఈ ఘటన జరిగింది
- కూతురు ప్రేమ వివాహం చేసుకుందని
- తల్లికి తెలియకుండా బిడ్డను దత్తతకు

ఈ ఫిర్యాదుపై సీరియస్‌గా స్పందించిన సీపీ బాగ్చీ వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేవించారు. వెంటనే ప్రత్యేక బృందాలతో గాలించి.. బాబును మూడు గంటల్లోనే కనిపెట్టారు. ఆ బిడ్డను తీసుకెళ్లి ఆర్అండ్బీ దగ్గర ఉన్న శిశుగృహకు అప్పగించారు. పిల్లవాడికి కామెర్లు ఉన్నాయని చెప్పి వైద్యం కోసం తీసుకెళ్తున్నట్లుగా అబద్ధం చెప్పి.. తన కుమార్తెతో శుక్ర కొన్ని డాక్యుమెంట్లలో సంతకాలు తీసుకుని.. బిడ్డను తీసుకెళ్లి వేరొకరికి దత్తత పేరుతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. కూతురి ప్రేమ వివాహం నచ్చకపోవడంతోనే శుక్ర ఇలా చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువతి తండ్రి శుక్రను విశాఖపట్నం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
కుమార్తెకు పుట్టిన బాబును ట్రీట్మెంట్ కోసమని తీసుకెళ్లిన తాత.. 2 నెలల తర్వాత ట్విస్ట్, పోలీసుల ఎంట్రీతో
విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష.. అసలేం జరిగిందంటే?. విశాఖ: ప్రభుత్వ లాయర్‌కు వేతనం చెల్లించలేదని.. కలెక్టర్ కారు సహా ఫర్నీచర్ స్వాధీనం, కోర్టు ఆదేశాలు. స్కూటర్ డిక్కీలో సెల్‌ఫోన్ పెడుతున్నారా.. బీకేర్ ఫుల్.!