ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులు సైతం ఫేమస్ అవుతుంటారు. ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తుంటారు. అద్భుతమైన నటనతో జనాల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంటారు. అగ్ర హీరోలకు ధీటుగా సహజ నటనతో కట్టిపడేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటిన నటులు.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్. స్టార్ హీరోలకు ధీటుగా నటించి మెప్పించాడు. కానీ ఇప్పుడు సినిమాలు వదిలేసి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..? సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు.. ఇప్పుడు అన్ని వదిలేసి ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. అతడే సావి సిద్ధు. ఈ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు తోపు యాక్టర్. గులాల్ , బ్లాక్ ఫ్రైడే , పాటియాలా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఆరంభం చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు సావి సిద్ధు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఆయన.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అతడు ముంబైలోని పరేల్‌లోని ఒక భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల నటనకు విరామం తీసుకోవలసి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను సినిమా రంగానికి తిరిగి రావడం చాలా కష్టమని.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.
తనకు సినీరంగంలోని చిత్రనిర్మాతలు పని కల్పిస్తారని.. ఆర్థికంగా సాయం చేస్తారని ఆశిస్తున్నట్లు సావి సిద్ధు తెలిపారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన సావి సిద్ధు.. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా ముంబైలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు సావి సిద్ధు..
ఇవి కూడా చదవండి

Savi Sidhu New
ఇవి కూడా చదవండి :
Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..