తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిరుపేద , ధనిక వ్యత్యాసం చూపిస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ధనుష్ బిచ్చగాడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. కుబేర సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. నాగార్జున మరోసారి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. కాగా ఈ సినిమాలో నాగార్జున భార్యగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె సినిమాలో కనిపించేది కొంతసేపు అయినా తన నటనతో ఆకట్టుకుంది.
ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పేరు సునయన. ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు స్పరిచితురాలే.. 2005లో వచ్చిన సంథింగ్ స్పెషల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత 10th క్లాస్ అనే సినిమాలో నటించింది. ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించి అలరించింది. తెలుగులో మొన్నామధ్య రాజరాజ చోర సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు కుబేర సినిమాలో మెరిసింది.
ఇవి కూడా చదవండి
అందం అభినయం ఉన్న ఈ చిన్నది ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక కుబేర సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునయన తన క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తుంది. ప్రస్తతం ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కుబేర సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి