ఇక దాదాపు 10 సంవత్సరాల నుంచి కన్నప్ప సినిమా కోసం బ్యాకెండ్‌లో కష్టపడుతున్న మంచు విష్ణు.. ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను థియేటర్స్‌లోకి తీసుకుచ్చాడు. ఇంప్రెసివ్ క్యాస్టింగ్‌తో.. పాన్ ఇండియా రేంజ్లో తన సినిమాకు మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే కన్నప్ప క్యాస్టింగ్‌లో ప్రభాస్ సో స్పెషల్ కదా..!!! ఈ స్పెషల్ క్యారెక్టర్ ను మొదట ప్రభాస్‌తో కాకుండా… యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆ రోల్ చేయించాలని విష్ణు అనుకున్నాడట. రుద్ర పాత్రకు ఎన్టీఆర్ అయితే చక్కగా న్యాయం చేస్తాడని.. స్క్రిప్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో విష్ణు థింక్ చేశాడట. అయితే కొందరు.. ప్రభాస్ ను తీసుకుంటే బాగుంటుందని.. మార్కెట్ పరంగా కూడా యాడ్ ఆన్ లా ఉంటుందని చెప్పడంతో… విష్ణు తన నిర్ణయాన్ని మార్చుకున్నారట. దానికితోడు… ప్రభాస్‌తో మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ బావా బావా.. అనుకుంటూ ఉంటారు. దీంతో ప్రభాస్‌ను ఒప్పించడం కూడా సులువని… విష్ణు డేర్ చేసి మరీ ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యాడట. అటు.. ప్రభాస్ కూడా ఏమీ ఆలోచించకుండా, రూపాయి కూడా రెమ్యునరేషన్‌గా తీసుకోకుండా కన్నప్ప సినిమాకు సైన్ చేశారట. అయితే ఉన్నట్టుండి కన్నప్ప టీం నుంచి బయటికి వచ్చిన ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌తో పాటు.. మంచు విష్ణు ఫ్యాన్స్‌ను కూడా షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..! విష్ణు దెబ్బకు రెబల్ స్టార్ విలవిల..
వార్ వన్ సైడ్.. దిక్కుతోచని స్థితిలో రజనీ
తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!
కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు