అయితే ఇప్పుడు ఇదే పెళ్లి డైలాగ్‌తో రుద్ర అలియాస్ ప్రభాస్‌ను… ఆన్ స్క్రీన్ పై ఇరుకున పెట్టాడు తిన్నడు. ఇరుకున పెట్టడమే కాదు.. ప్రభాస్ పై సంధించిన పెళ్లి ప్రశ్నతో … థియేటర్లో అందర్నీ అరిపించాడు మన నయా తిన్నడు. కన్నప్ప సినిమాలో… సెకండ్ ఆఫ్ తర్వాత… రుద్ర, కన్నప్ప పాత్రల మధ్య ఓ హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. అయితే డిస్కషన్లో … పెళ్లి టాపిక్ తీసుకొస్తాడు తిన్నడు. తన ఎదురుగా నిల్చున్న రుద్రను… ‘నీకు పెళ్లి అయ్యిందా ?’ అని నేరుగా అడిగేస్తాడు తిన్నడు. దానికి.. ‘నా పెళ్లి గురించి ఎందుకు లే..’ అని రుద్ర వ్యంగ్యంగా సమాధానమిస్తాడు. దానికి వెంటనే తిన్నడు… ‘ఆ.. పెళ్లి చేసుకుంటే నీకూ తెలిసేది లే’ అంటూ.. జవాబిస్తాడు తిన్నడు. అయితే, వీరిద్దరి మధ్య సాగిన ఈ సంభాషణే.. ఇప్పుడు థియేటర్లలో ఫ్యాన్స్‌ను గోల పెడుతోంది. మొత్తానికి తిన్నడు మూవీతో మరోసారి ..ప్రభాస్ పెళ్లి ముచ్చట ఇటు సోషల్ మీడియాలోనూ చర్చగా మారింది. దీంతో.. తొందరగా పెళ్లి చేసుకోవాలనే రిక్వెస్ట్‌లు.. ఫ్యాన్స్ గ్రూప్స్ నుంచి ప్రభాస్‌కు వస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వార్ వన్ సైడ్.. దిక్కుతోచని స్థితిలో రజనీ
తిన్నడు ఏమో కానీ.. నెమలి అందర్నీ కట్టిపడేసింది !!
కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు
ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం.. ఎందుకో తెలుసా