గత వారానికి ముందు లక్షా రెండు వేలకు చేరిన తులం బంగారం ధర.. రూ. 5 వేల మేర తగ్గి ఇప్పుడు 97 వేలకు తగ్గింది. కాగా, ఈ ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 30, 2025 సోమవారం ఉదయం దేశీయ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల తులం బంగారం ధర సగటున రూ. 97,260గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. శనివారంతో పోల్చితే.. సోమవారానికి 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర ధర తగ్గింది. వెండి కేజీ ధర రూ. 100 తగ్గి.. రూ.1,07,700లుగా ఉంది. ఇక.. జూన్ 30,సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ.97,260 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,150 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,700లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.97,410 పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.89,300 లుగా ఉంది.అక్కడ కేజీ వెండి ధర రూ.1,07,700 లుగా ఉంది. ఇక.. ముంబైలో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260 గానూ, 22 క్యారెట్ల ధర రూ.89,150 ఉండగా, వెండి ధర కేజీ రూ.1,07,700 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కేజీ రూ.1,17,700 లుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల తులం ధర రూ.97,260, 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,07,700 లుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం.. ఎందుకో తెలుసా
మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు